English | Telugu

గల్లీ గల్లీకి వైన్ షాప్ పెట్టిస్తానని చెప్పిన ఫైమా!

ఫైమా‌ పటాస్.. బిగ్ బాస్ సీజన్-6 తో అందరికీ సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన ఫైమా.. ఆ తర్వాత జబర్దస్త్ లోకి వచ్చింది. అక్కడ కూడా తన కామెడీ టైమింగ్ తో తనేంటో నిరూపించుకుంది. అలా బుల్లితెరపై నవ్వులు పూయించిన ఫైమాకి బిగ్ బాస్ సీజన్-6 లో అవకాశం లభించింది.

బిగ్ బాస్ హౌస్ లోకి కమెడియన్ గా అడుగుపెట్టిన ఫైమా.. హౌస్ లో నవ్వులు పూయించింది. అయితే ఒకానొక దశలో తను వేసే పంచులు ఎదుటివారిని ఇబ్బంది పెడతాయని అప్పుడే తెలిసింది. దాంతో హోస్ట్ గా చేస్తున్న నాగార్జున ఫైమాకి అలా వెటకారంగా మాట్లాడకూడదని వార్నింగ్ కూడా ఇచ్చాడు. అయిన తను మారలేదు. దాంతో ప్రేక్షకులలో ఫైమాపై నెగెటివ్ ఇంపాక్ట్ కలిగిందనే చెప్పాలి. దాంతో బిగ్ బాస్ వీక్లీ వైజ్ ఎలిమినేషన్ లో ఫైమా బయటకొచ్చింది. అయితే ఫైమా తనకంటూ కొంత ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకుంది. ఆ ఫ్యాన్స్ ఫైమా బయటకొచ్చాక గ్రాంఢ్ గా వెల్ కమ్ చెప్పారు. దీంతో అందరి దృష్టి ఫైమా మీద పడింది. అలా ఫైమా ఒక్కసారిగా సెలబ్రిటీ హోదాని దక్కించుకుంది. ఆ తర్వాత బిబి జోడీలో సూర్య తో కలిసి డ్యాన్స్ చేసి వావ్ అనిపించింది. దీంతో ఫైమాకి ఫ్యాన్ బేస్ మరింత పెరిగింది. అయితే ఫైమా తన గురించి ప్రతీ అప్డేట్ ని ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటుంది.

ఇటు ఇన్ స్టాగ్రామ్ లో, అటు యూట్యూబ్ లో రెగ్యులర్ గా రీల్స్, షార్ట్స్ చేస్తూ బిజీగా ఉంటుంది ఫైమా. కాగా తాజాగా ఫైమా చేసిన ఒక వీడియో ‌ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ గా మారింది. పబ్లిక్ ప్రాంక్ పేరుతో ఒక క్వశ్చన్ ఫైమాని అడుగగా క్రేజీ ఆన్సర్ ఇచ్చింది. నువ్వే సీఎమ్ అయితే ఏం చేస్తావని అడుగగా.. నేనే సీఎమ్ అయితే నూట యాభై రూపాయలున్న బీర్ ని యాభై రూపాయలు చేస్తా, గల్లీ గల్లీకి వైన్ షాప్ పెట్టిస్తానని ఫైమా అంది. దాంతో ఈ వీడియో వైరల్ గా మారింది. మా తల్లి బాగుండాలి నువ్వు అంటూ ఒకరు కామెంట్ చేశారు. కామారెడ్డి అంటారు రా బాబు అని ఒకరు, నువ్వు ఎప్పటికైనా సీఎమ్ కావాలి ఫైమా, ఏ గుండె రా అది, ఆ గుండె బ్రతకాలి రా అంటూ మరొకరు ఇలా ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇన్ స్టాగ్రామ్ లో ఈ వీడియోకి విశేష స్పందన లభిస్తుంది.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.