English | Telugu

ఎందుకంత ద్వేషం...అసలా గుంపును రెచ్చగొట్టిన వాళ్లెవరు...బాధపడుతున్న ఝాన్సీ

ఫస్ట్ జనరేషన్ స్టార్ యాంకర్స్ లో ఝాన్సీ ఒకరు. అప్పట్లో సుమ, ఉదయభాను, ఝాన్సీ ఫుల్ ఫార్మ్ లో ఉండేవాళ్ళు. వీళ్ళను చూస్తే చాలు ఆడియన్స్ లో ఫుల్ జోష్ వచ్చేది. "టాక్ ఆఫ్ ది టౌన్" షో ఝాన్సీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. అలాగే పలు బుల్లితెర షోలకు ఆమె యాంకర్ గా వ్యవహరించారు కూడా. యాంకరింగ్ చేస్తూనే నటిగా కూడా ఈమె మంచి సక్సెస్ ని అందుకున్నారు. అలాంటి ఝాన్సీ లైఫ్ లో కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఏదేమైనా ఆమె యాంకరింగ్ ఒకప్పుడు టాప్ అని చెప్పొచ్చు. సోషల్ మీడియా వాడకం పెరిగాక ఝాన్సీ కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.

తనకు సంబంధించిన అప్ డేట్స్ ని ఆడియన్స్ తో ఈ మాధ్యమం ద్వారా షేర్ చేసుకుంటున్నారు. అలాంటి ఒక ఇష్యూ మీద ఇప్పుడు ఆమె స్టేటస్ పెట్టుకున్నారు. మణిపూర్ ఎంత అల్లకల్లోలంగా ఉందో అందరికీ తెలుసు..దాని మీద మోడీ ఒక్క మాట మాట్లాడకపోవడం పై విపక్షాలు కూడా రగడ చేస్తున్నాయి. రీసెంట్ గా విపక్షాల నుంచి కొంత మంది మణిపూర్ వెళ్లి అక్కడి పరిస్థితులను సమీక్షించిన విషయం తెలిసిందే. అలాంటి ఇష్యూ మీద ఝాన్సీ "మణిపూర్, హర్యానా, ఉత్తరప్రదేశ్ లో అసలెందుకు అంత ద్వేషం ? అసలెవరు ఈ గుంపును రెచ్చగొట్టింది. దీని వెనక వున్న రాజకీయ అజెండా ఏమిటి ..అసలు నేను ఈ విషయం మీద ఎలా స్పందించాలో తెలీడం లేదు ..ఆ ప్రాంతాల్లో శాంతి, సమానత్వం, ఓర్పు ఉండేలా ప్రార్ధించడం తప్ప" అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు. తన లేటెస్ట్ అప్ డేట్స్ తో పాటు ప్రపంచ విషయాల మీద కూడా స్పందిస్తూ ఉంటారు ఝాన్సీ. అలాగే తన ఇంటి పెరట్లో పండించే కూరగాయల గురించి ఎప్పుడెప్పుడు ఎం పండాయో కూడా చెప్తూ పోస్టులు పెడతారు ఝాన్సీ. జయం మనదేరా, సోంతం, యగ్నం, తులసి, అష్టా చెమ్మ మూవీస్ లో మంచి మంచి గుర్తుండిపోయే రోల్స్ చేశారు.