English | Telugu
షణ్ముఖ్ చేసిన ఆ పోస్ట్ దీప్తి సునైన కోసమేనా!
Updated : Aug 2, 2023
షణ్ముఖ్.. యూత్ కి బాగా కనెక్ట్ అయి మంచి ఫేమ్ లోకి వచ్చిన యూట్యూబర్. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకొని బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసాడు. 'సాఫ్ట్ వేర్ డెవలపర్' వెబ్ సిరీస్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న షణ్ముఖ్.. ఆ తర్వాత 'సూర్య' వెబ్ సిరీస్ తో ప్రతీ మధ్యతరగతి కుర్రాడికి కనెక్ట్ అయ్యాడు.షణ్ముఖ్, దీప్తి సునైన ఇద్దరు కలిసి షార్ట్ ఫిల్మ్స్ చేసి స్నేహితులుగా మారారు. వారి స్నేహం కాస్త ప్రేమగా మారింది.
ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ -5 లో షణ్ముఖ్ ఎంట్రీ ఇచ్చాడు. అదే సీజన్ లో సిరి హనుమంత్ కూడా రావడంతో.. వారిద్దరి హౌస్ లో క్లోజ్ గా ఉండటం వల్ల దీప్తి సునైన, షణ్ముఖ్ ల మధ్య కథ మారింది. బిగ్ బాస్ లోకి వెళ్ళేముందు వరకు షణ్ముఖ్, దీపు వాళ్ళిద్దరి చేతిపై టాటూస్ ఉండేవి. బిగ్ బాస్ పూర్తయ్యాక వారిద్దరు విడిపోయారు. కాగా ప్రస్తుతం ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడటం లేదు.అసలు విషయానికి వస్తే బిగ్ బాస్-5 లో షణ్ముఖ్, సిరి హన్మంత్ లు బాగా క్లోజ్ గా ఉన్నారనే విషయం అందరికి తెలిసిందే. ఫ్యామిలీ వీక్ లోనే అటు షణ్ముఖ్ వాళ్ళ అమ్మ, ఇటు సిరి వాళ్ళ అమ్మ వచ్చి..
అంత క్లోజ్ గా ఉండొద్దంటూ బహిరంగంగానే చెప్పారు. కానీ వాళ్ళిద్దరు ఎవరి మాటలు పట్టించుకోకుండా అదే ధోరణిని కనబరిచారు. ఇక బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక కొన్ని రోజులకు షణ్ముఖ్, దీపు విడిపోయారు. అప్పట్లో అది నెట్టింట్లో వైరల్ గా మారింది. దాంతో షణ్ముఖ్, సిరి తో క్లోజ్ గా ఉండడం వల్లే వాళ్ళు విడిపోయారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. అప్పటి నుండి ఇద్దరు.. ఎవరి లైఫ్ వాళ్ళు హ్యాపీగా గడుపుతున్నారు. మరోవైపు ఒకరి సోషల్ మీడియా పోస్ట్ లకు మరొకరు ఇండైరెక్ట్ గా కౌంటర్ లు వేస్తూ వస్తున్నారు.
తాజాగా దీప్తి చేసిన ఆల్బమ్ సాంగ్ పోస్టర్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా.. ఆ పోస్ట్ చేసిన ఒక గంటకే షణ్ముఖ్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేశాడు. " ప్రతీదానికి ఒక కారణం ఉంటుంది " అని క్యాప్షన్ పెట్టి తన ఫోటోని పోస్ట్ చేశాడు. అయితే వీళ్ళిద్దరి కోల్డ్ వార్ చూస్తున్న దీప్తి, షణ్ముఖ్ ల కామన్ ఫ్యాన్స్.. ఈ ఇండైరెక్ట్ కౌంటర్లు ఏంటో అంటు కామెంట్లు చేస్తున్నారు. మరి షణ్ముఖ్ చేసిన పోస్ట్ దీప్తి సునైనని ఉద్దేశించి చేశాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. మరొకవైపు షణ్ముఖ్ తో తను కలిసి ఉన్నప్పుడు చేసిన వాటిని పోస్ట్ ల రూపంలో దీప్తి సునైన షేర్ చేస్తున్న విషయం తెలిసిందే. మరి ఈ కోల్డ్ వార్ ఆగేదెప్పుడో చూడాలి మరి.