English | Telugu

ముందు ఫ్రెండ్..తర్వాత వైఫ్ అన్న అమర్ ..ఇంటికి రా నీ పని చెప్తా అన్న తేజు

'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' నెక్స్ట్ వీక్ ప్రోమో మంచి జోష్ తో కనిపిస్తోంది. ఫ్రెండ్ షిప్ డే సందర్భాన్ని పురస్కరించుకుని "ఫ్రెండ్ షిప్ డే స్పెషల్" గా ఈ ప్రోమోని డిజైన్ చేశారు మేకర్స్. ఈ ఎపిసోడ్ కి అమర్ దీప్ - మానస్ , తేజస్విని గౌడ - సుహాసిని , ముక్కు అవినాశ్-కెవ్వు కార్తిక్, అనపూర్ణమ్మ- శ్రీలక్ష్మీ, బేబీ క్రితిక- సహృద, నోయెల్- వితికా శేరు వచ్చి ఆడియన్స్ అలరించారు. ఈ సందర్భంగా అమర్‌ను సరదాగా ఆట పట్టించింది శ్రీముఖి. "నీ పెళ్లాం కోసం వచ్చావా నిజంగా నీ ఫ్రెండ్ మానస్ కోసం వచ్చావా" అని అడిగేసరికి "ఫస్ట్ అయితే ఫ్రెండ్ కోసం వచ్చా ఆ తర్వాతే పెళ్లాం" అని అమర్ అనేసరికి అక్కడే ఉన్న తేజు " ఇంటికి రా చెప్తా" అని సరదాగా ఆట పట్టించింది. తర్వాత సీనియర్ నటీమణులు అన్నపూర్ణమ్మ- శ్రీలక్ష్మి వచ్చారు.

"రెండు కొప్పులు ఒక దగ్గర ఉండలేవు ..ఎప్పుడూ ఏదో ఒకటి అంటుంటావు" అని అన్నపూర్ణమ్మను శ్రీముఖి అడిగేసరికి "ఆమెది కొప్పు నాది ఇది" అని తన జుట్టును చూపించారు శ్రీలక్ష్మి. బుల్లితెర మీద నటించే అమర్ దీప్, మానస్ మంచి ఫ్రెండ్స్. అమర్ వైఫ్ తేజు-మానస్ కలిసి 'కోయిలమ్మ' అనే సీరియల్ లో నటించారు. అలా వీళ్ళ ముగ్గురు ఎప్పుడూ బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటారు. చాల సందర్భాల్లో వీళ్లంతా కలిసి కనిపిస్తూనే ఉంటారు. ఐతే మానస్ ఇప్పుడు 'బ్రహ్మముడి' సీరియల్ లో రాజ్‌గా నటిస్తున్నాడు. ఈ సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకుపోతోంది. అమర్ దీప్ మాత్రం ప్రియాంక జైన్ తో కలిసి 'జానకి కలలగనలేదు' సీరియల్ లో రామ రోల్ లో అమాయక భర్త పాత్రలో నటిస్తున్నాడు. అలాగే అమర్ దీప్- తేజు జోడి 'నీతోనే డ్యాన్స్' షోలో ఇరగదీసే పెర్ఫార్మెన్సెస్ చేస్తూ ప్రతీ వారం టాప్ పొజిషన్ లో ఉంటున్నారు. అలాంటి ఈ ఫ్రెండ్స్ అంతా రేపు ఆదివారం రాబోయే షోలో ఎంటర్టైన్ చేయబోతున్నారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.