English | Telugu
మావ-కోడళ్ల ఫైట్స్ తో కొత్త సీరియల్ త్వరలో స్టార్ మాలో మావగారు
Updated : Aug 2, 2023
స్టార్ మా అంటే చాలు కలర్ ఫుల్ ఈవెంట్స్ మాత్రమే కాదు మంచి జోష్ ఉన్న సీరియల్స్ అని కూడా తెలుసు. ఆడియన్స్ స్టార్ మా సీరియల్స్ ని ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. ఇందులో ప్రసారమయ్యే సీరియల్స్ కంటెంట్ కావొచ్చు రేటింగ్ కావొచ్చు ఆ రేంజ్ లోనే ఉంటాయి మరి. ఇక ఇప్పుడు కొత్త సీరియల్ ఒకటి పట్టాలెక్కబోతోంది. అదే "మామగారు". దానికి సంబంధించిన ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో "దేవత" సీరియల్ ఫేమ్ లీడ్ రోల్ చేస్తోంది . అప్పట్లో 'దేవత' సీరియల్ ... అందులో నటించిన సుహాసిని ఎంతో మందికి నచ్చేసింది. ఈ సీరియల్ కి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు సుహాసిని లీడ్ రోల్ లో చేసినా లేడీ ఓరియెంటెడ్ సీరియల్ ని లైన్ లోకి తీసుకొస్తోంది స్టార్ మా.
ఇక ఈ మూవీ ప్రోమోలో ఉన్న కంటెంట్ ని పరిశీలిస్తే ప్రతీ ఇంట్లో జరిగే విషయాన్నే చూపించారు. ఇంటికి వచ్చే కోడళ్ళు ఇంటి పనులే చేయాలి తప్ప ఉద్యోగాలు చేయడానికి కాదు అనుకునే మావయ్యని ఆ ఇంటికి వచ్చిన కొత్త కోడలు సుహాసిని ఎలా మార్చిందో చెప్పే లైన్ తో ఈ స్టోరీ రాబోతోంది. "పెళ్ళైపోతే ఆడపిల్ల పుట్టింటికి ఏమీ చేయకూడదా" అని సుహాసిని అత్తగారిని ప్రశ్నించే లైన్ చాలా హైలైట్ గా ఉంది. ఇక పొతే ఈ సీరియల్ ఎప్పుడు, ఎన్నింటికి ప్రసారమవుతుంది అనే విషయాన్ని ఇంకా రివీల్ చేయలేదు. ఇప్పటికే ఆడియన్స్ చూస్తున్న ఎన్నో సీరియల్ టైమింగ్స్ ని మార్చేసింది స్టార్ మా . ఇక ఇప్పుడు ఏ సీరియల్ ని ఏ స్లాట్ లోకి మార్చేస్తుందో..ఏ టైములో ఈ మావగారు సీరియల్ ని ప్రసారం చేస్తుందో అని ఆడియన్స్ అంతా ఎదురు చూస్తున్నారు. దేవత సీరియల్ తర్వాత సుహాసిని ఎక్కడ కనిపించలేదు. మళ్ళీ ఇన్ని రోజులకు తెర మీద కొత్త సీరియల్ తో ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్స్ మాత్రం తమ స్టయిల్లో కామెంట్స్ చేస్తున్నారు. "అన్ని సీరియల్స్ లో అత్తా- కోడళ్ల గొడవలు ఐతే... ఈ సీరియల్ లో మామ- కోడళ్ల ఫైట్స్ అన్నమాట.. తెలుగు హీరోస్ ఎవరూ లేరా ? తమిళ్ హీరో ని తీసుకొచ్చారు. ఏ సీరియల్ అయ్యేటట్లు లేదు. మరి ఈ కొత్త సీరియల్ ని ఏ టైం లో ప్రసారం చేస్తారో ?" అంటున్నారు.