English | Telugu
బ్రహ్మముడి కావ్య, రాజ్ చేసిన రీల్ కి వన్ మిలియన్ వ్యూస్!
Updated : Aug 2, 2023
హలో గురు ప్రేమ కోసమేరా జీవితం.. పాటతో అప్పట్లో నిర్ణయం సినిమాలో నాగార్జున, అమల కలిసి చేసిన డ్యూయెట్ కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికి తెలిసిందే. ఇప్పటికీ ఆ పాట అంటే అంతే క్రేజ్ ఉంది. అయితే ఇప్పుడు ఆ ఆ పాటలోని లిరిక్స్ కి ఎంతో మంది సెలబ్రిటీలు ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్, యూట్యూబ్ లో షార్ట్స్ అంటూ తెగ వైరల్ అవుతున్నారు. అయితే ఇప్పుడు అదే కోవకు మానస్ నాగులపల్లి, దీపిక రంగరాజు చేరారు. వీరిద్దరు కలిసి ప్రస్తుతం స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కాగా వీరిద్దరు కలిసి ఇన్ స్టాగ్రామ్ లో ఈ పాటతో రీల్ చేశారు. అయితే వీరిద్దరు కలిసి చేసిన ఈ పాట ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది.
దీపిక రంగరాజు(కావ్య), మానస్ నాగులపల్లి(రాజ్) బ్రహ్మముడి సీరియల్ లో లీడ్ రోల్స్ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా వీరిద్దరిది ఆఫ్ స్క్రీన్ భిన్నమైన ప్రపంచం. అయితే దీపిక తనకంటూ సొంతంగా యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసి వ్లాగ్స్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంది. మానస్ ప్రైవేటు ఆల్బమ్ సాంగ్స్ లో బిజీగా ఉంటున్నాడు. కాగా వీరిద్దరు కలిసి బ్రహ్మముడి సీరియల్ సూపర్ జోడీగా చేస్తున్నారు. ఒకరిని మించి ఒకరు తమ నటనతో ఆకట్టుకుంటున్నారు.
బ్రహ్మముడి సీరియల్ లో కావ్య, రాజ్ ల ఆన్ స్క్రీన్ జోడీకి ఫ్యాన్ బేస్ విపరీతంగా ఉంది. ఇన్ స్టాగ్రామ్ లో వీరిద్దరి పేర్లతో చాలా ఫ్యాన్ పేజీలు ఉన్నాయి. కారణం ఈ సీరియల్ లో అత్తారింట్లో ఉన్న కావ్య పర్సనల్ గా జాబ్ చేస్తూ తన ఫ్యామిలీకి అండగా ఉండాలనుకుంటుంది. మరొకవైపు రాజ్ ఇప్పుడిప్పుడే కావ్యని అర్థం చేసుకుంటూ తనకి దగ్గరవుతున్నాడు. అయితే సీరియల్ షూటింగ్ లేని రోజున, లేదా షూటింగ్ గ్యాప్ లో ఇందులో నటిస్తున్న వాళ్ళంతా రీల్స్ చేస్తున్నారు. స్వప్న పాత్రలో చేస్తున్న హమీద, రుద్రాణి పాత్రలో చేస్తున్న షర్మిత, కనకం పాత్రలో చేస్తున్న నీప.. ఇలా అందరూ తమ తమ ఇన్ స్టాగ్రామ్ పేజీలలో రీల్స్ చేస్తూ ట్రెండింగ్ లో ఉండగా.. వారి రీల్స్ కింద కామెంట్లలో రాజ్, కావ్యల రీల్ కోసం వెయిటింగ్ అని చాలామంది అన్నారు. దాంతో నాలుగు రోజుల క్రితం రాజ్(మానస్), కావ్య(దీపిక) కలిసి హలో గురు ప్రేమ కోసమేరా జీవితం అంటు రీల్ చేసి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. అయితే ఈ రీల్ ని ఒక మిలియన్ యూజర్స్ చూసారు. కాగా ఇప్పటికీ వీరిద్దరు కలిసి చేసిన ఈ రీల్ కి విశేష స్పందన లభిస్తుంది.