English | Telugu
కాలేజ్ బాయ్ చేసిన పనిని కనిపెట్టిన రిషి ఏం చేయనున్నాడు!
Updated : Aug 2, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -830 లో.. మహేంద్ర రెడీ అయి రిషి దగ్గరికి బయలుదేర్తాడు. జగతి నేను కూడా వస్తానని అనగానే.. వద్దు జగతి నువ్వు వస్తే రిషి నాతో మాములుగా ఉండలేడు, ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. అయినా నువ్వు ఇప్పుడు ఇక్కడే ఉండాలి శైలేంద్ర ఏం ప్లాన్ చేస్తున్నాడో తెలుసుకో అని చెప్పి మహేంద్ర వెళ్ళిపోతాడు.
మరొక వైపు రిషిని జాగ్రత్తగా ఉండమని వసుధార చెప్పే ప్రయత్నం చేస్తే.. రిషి వినిపించుకోడు. మీరు ఇలా ఏం ప్రయత్నాలు చెయ్యకండి మేడమ్, నేను మిషన్ ఎడ్యుకేషన్ బాధ్యతలు తీసుకుంటున్నాను కానీ మీ గురించి అలోచించి కాదని చెప్పి వెళ్ళిపోతాడు. మరొకవైపు రిషి సర్ ని జాగ్రత్తగా ఉండమని చెప్దామంటే వినట్లేదని బాధపడుతు కాలేజీ లోపలికి వెళ్తుంది. అప్పుడే అక్కడ కాలేజీ బాయ్ శైలేంద్రతో ఫోన్ లో మాట్లాడడం వింటుంది. మీరు చెప్పినట్టే చేశాను సర్ రేపు కాలేజీ గోడలపై అంటించిన రిషి, వసుధార మేడమ్ ల పోస్టర్ లు చూసి అందరూ వాళ్ళని అసహ్యించుకుంటారని కాలేజీ బాయ్ చెప్పడం వసుధార విని.. ఎవరితో మాట్లాడుతున్నావని ఫోన్ లాక్కుంటుంది. ఆఫీస్ బాయ్ అక్కడా నుండి వెళ్ళిపోతాడు.
వెంటనే రీడయల్ కొట్టగానే ఫోన్ శైలేంద్రకి వెళ్తుంది. శైలేంద్ర నే ఇప్పటి వరకు కాలేజీ బాయ్ తో మాట్లాడాడని తెలుసుకొని.. ఇంకా మీ కోపం తగ్గలేదు మీ నుండి దూరంగా వచ్చినా, మమల్ని ప్రశాంతంగా ఉండనివ్వరా అంటూ వసుధార శైలేంద్రపై కోప్పడుతుంది. శైలేంద్ర కూడా ఏ మాత్రం తగ్గకుండా అంతే కోపంగా మాట్లాడతాడు. ఆ తర్వాత నా గురించి అందరికి తెలిసింది ఇక ఎవరికి భయపడవద్దని శైలేంద్ర అనుకుంటాడు. ఆ తర్వాత శైలేంద్ర ఎక్కడికో బయలుదేరి వెళ్తుండగా జగతి ఎదురు పడుతుంది. జగతి, శైలేంద్ర ఇద్దరు కొద్దీసేపు వాదించుకుంటారు. ఆ తర్వాత జగతి టెన్షన్ గా మహేంద్రకి కాల్ చేసి శైలేంద్ర ఏదో ప్లాన్ చేసినట్టున్నాడని చెప్తుంది. సరే నేను చూసుకుంటానని మహేంద్ర అంటాడు.
ఆ తర్వాత వసుధార మహేంద్రకి కాల్ చేసి కాలేజీ బాయ్ చేసిన పని గురించి చెప్పి హెల్ప్ చెయ్యమంటుంది. నువ్వేం టెన్షన్ పడకు నేను చూసుకుంటాను.. వస్తున్నానని మహేంద్ర చెప్తాడు. మరొకవైపు రిషి పని మీద ప్రింటింగ్ ఆఫీస్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ రిషి వసుధారల ఎంగేజ్మెంట్ ఫోటో ని కంప్యూటర్ లో చూసి షాక్ అవుతాడు. ఇది ఎవరు ఇచ్చారని రిషి అక్కడ ఉన్న అతని అడుగుతాడు. కాలేజీ బాయ్ తీసుకొని వచ్చి పోస్టర్ లు ఇవ్వమన్నాడని, ఇప్పుడే వస్తానని అన్నాడని అంటాడు. అలా అనగానే మీరు ఆ పిక్స్ డిలేట్ చెయ్యండని అక్కడే రిషి ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.