Read more!

English | Telugu

ఈ భూమ్మీద అసలైన అప్సరస తనేనంట!


  
బిగ్ బాస్ లో గ్లామర్ కి  కేర్ అఫ్ అడ్రెస్ గా నిలిచిన బ్యూటీ వాసంతి కృష్ణన్. బిగ్ బాస్ సీజన్-6 లో తన అందంతో ఆకట్టుకొని అభిమానులను సంపాదించుకుంది. బిగ్ బాస్ ఎంట్రీతో ఫేమ్ లోకి వచ్చిన ఈ గ్లామర్ క్వీన్ వరుస ఆఫర్స్ తో బిజీ అయిపోయింది...హౌస్ లో ఉన్నన్ని రోజులు వెనకాల ఉండి ఎక్కువగా గ్రూప్ లతో కలవకుండా ఉన్న వాసంతి.. ఇంకో వారంలో బయటకొస్తుందనే టైమ్ లో ఒక్కొక్కరితే కలవడం ప్రారంభించింది. కానీ అప్పటికే తనకి ఫ్యాన్ బేస్ లేకపోవడం, టాస్క్ లలో, గేమ్స్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయకపోవడంతో తనకి నామినేషన్లలో ఓటింగ్ లిస్ట్ లో వెనుకబడింది. దాంతో హౌస్ నుండి బయటకొచ్చింది వాసంతి. అయితే బిగ్ బాస్ నుండి బయటకొచ్చాక సినిమా ఆఫర్లు చాలానే వచ్చాయి. ప్రస్తుతం బీబీ జోడీలో అర్జున్ కి జంటగా వాసంతి జత కట్టి అందరిని తన డాన్స్ తో తన వైపుకి తిప్పుకుంది.

ప్రస్తుతం వాసంతి వరుస ఆఫర్స్ తో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. కాగా "ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు"అనే సీరియల్ లో ముఖ్యమైన పాత్రలో చేస్తూ అందరిని ఆకట్టుకుంటుంది. ఇదే కాకుండా పలు టీవీ కార్యక్రమాల్లో కనిపిస్తూ ప్రేక్షకులకు ఎప్పుడు దగ్గరగా ఉంటు వస్తుంది వాసంతి. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. తాజాగా శ్రీసత్యతో, వాసంతి చేసిన డాన్స్ ఎంత పాపులర్ అయిందో అందరికి తెలిసిందే.

అయితే వాసంతి ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ బిజీగా ఉంటుంది. నిన్న రాత్రి ఒక పబ్ లో ఇనయా, వాసంతి కలిసి ఎంజాయ్ చేశారు. వాళ్ళిద్దరు కలిసిన వీడీయోలని ఇనయా, వాసంతి తమ తమ‌ ఇన్ స్టాగ్రామ్ లలో షేర్ చేశారు. అయితే తాజాగా వాసంతి తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక ఫ్యాన్ తనని పొగుడుతూ  చేసిన  పోస్ట్ ని షేర్ చేసింది. " రంభ, ఊర్వశి, మేనకలను దేవతలంతా అప్సరసలని అంటారు. కానీ భూమ్మీద అసలైన అప్సరస ఉంది " అని ఒక ఫ్యాన్ వాసంతి ఫోటోకి క్యాప్షన్ ఇవ్వడంతో.. ఆ ఫోటోని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది వాసంతి. ఇలా ఫ్యాన్ బేస్ ని పెంచుకుంటుంది వాసంతి. కాగా ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ గా మారింది.