English | Telugu

రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ క‌హానీలో అన‌న్య‌

ర‌ణ్‌వీర్ సింగ్ హీరోగా న‌టిస్తున్న సినిమా రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ క‌హానీ. ఆలియా భ‌ట్ నాయిక‌గా న‌టిస్తున్నారు. ఈ సినిమా ట్రైల‌ర్ ఇవాళ విడులైంది. ట్రైల‌ర్‌కి చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. రెండు రాష్ట్రాల‌కు సంబంధించిన వ్య‌క్తులు, వారి ఆచార వ్య‌వ‌హారాలు, ప్రేమ‌, పెళ్లి, పెద్ద‌లు, కుటుంబాలు... ఇలాంటి విష‌యాల‌తో సాగింది ట్రైల‌ర్‌. డైలాగులు యూత్‌తో పాటు, ఫ్యామిలీని మెప్పించేలా ఉన్నాయి. ఈ నెల 28న విడుద‌ల కానుంది రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ క‌హాని. క‌ర‌ణ్ జోహార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఏడో సినిమా ఇది. గ‌ల్లీబోయ్ త‌ర్వాత ర‌ణ్‌వీర్ సింగ్‌, ఆలియా క‌లిసి న‌టిస్తున్నారు. ఇందులో ర‌ణ్‌వీర్‌, ఆలియాకు మ‌ధ్య ఉన్న లిప్ లాక్ నెటిజ‌న్ల‌కు షాక్ ఇచ్చింది. పెళ్లి త‌ర్వాత న‌టించిన ఆలియా, కిస్ సీన్ల‌కు అబ్జెక్ష‌న్ చెప్ప‌లేద‌న్న విష‌యం ఈ ట్రైల‌ర్ తో స్ప‌ష్ట‌మైంది.

ప్రియాంక రూట్లో క‌త్రినా... రీప్లేస్ చేస్తున్న కియారా!

ఫ‌ర్హాన్ అక్త‌ర్ సినిమా జీ లే జ‌రా అనౌన్స్ చేసి రెండేళ్లు కావస్తోంది. ప్రియాంక చోప్రా, ఆలియా భ‌ట్‌, క‌త్రినా కైఫ్‌తో క్రేజీ ప్రాజెక్ట్ గా ప్ర‌క‌టించారు. అయితే, ఈ ముగ్గురు క‌థానాయిక‌లు ఎవ‌రికి వారు బిజీగా ఉండటంతో ప్రాజెక్ట్ డిలే అయింది. అస‌లు ఈ సినిమా, ఇలాంటి సినిమా కావాల‌ని ఇనిషియేట్ చేసిన ప్రియాంక చోప్రా ఇప్పుడు ప్రాజెక్ట్ నుంచి ఔట్ అయ్యార‌న్న‌ది అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తిన విష‌యం. ప్రియాంక ప్రాజెక్టులో లేర‌ని తెలిసి క‌త్రినా కైఫ్ కూడా డీల్ కేన్సిల్ చేసుకున్నార‌ట‌. ఆలియా మాత్రం స్టిల్ స్టిక్ ఆన్ అయ్యార‌న్న‌ది న్యూస్‌. వెళ్లిపోయిన ఇద్ద‌రి స్థానంలో అనుష్క శ‌ర్మ‌, కియారా అద్వానీని రీప్లేస్ చేసి సినిమా చేయ‌డానికి ఫ‌ర్హాన్ అక్త‌ర్ ప్లాన్ చేస్తున్నారు. రెసెంట్‌గా పెళ్లిళ్లు చేసుకున్న ఆలియా, కియారా, ఎక్స్ పీరియ‌న్స్‌డ్ ఇల్లాలు అనుష్క క‌లిసి చేసినా ప్రాజెక్టుకు అంతే క్రేజ్ ఉంటుంద‌ని అంటున్నారు ట్రేడ్ పండిట్స్.

నీటిలో స‌ల్మాన్‌, క‌త్రినా... సూప‌ర్ యాక్ష‌న్‌

స‌ల్మాన్ ఖాన్‌, క‌త్రినా కైఫ్ న‌టిస్తున్న సినిమా టైగ‌ర్ 3. ఈ సినిమాకు ఎవెంజ‌ర్స్ తో లేటెస్ట్ గా క‌నెక్ష‌న్ కుదిరింది. యాక్ష‌న్ కో ఆర్డినేట‌ర్ క్రిస్ బ‌ర్న‌స్ ఈ సినిమా కోసం ప‌నిచేయ‌డానికి సిగ్న‌ల్ ఇచ్చారు. య‌ష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివ‌ర్శ్ లో వ‌స్తున్న సినిమా టైగ‌ర్‌3. హై ఆక్టేన్ యాక్ష‌న్ సీక్వెన్స్ ఉంటాయి. మార్వెల్స్ హిస్టారిక్ హిట్ ఎవెంజ‌ర్స్ ఎండ్ గేమ్‌కి ప‌నిచేసిన క్రిస్ బ‌ర్న‌స్ ఇప్పుడు టైగ‌ర్ 3 కి ప‌నిచేస్తున్నారు. మెరైన్ యాక్ష‌న్‌ని కంపోజ్ చేయ‌డంలో అత‌ను సిద్ధ‌హస్తుడు. ది బార్న్ అల్టిమేట‌మ్‌, ఐ యామ్ లెజెండ్‌, జోక‌ర్‌, డాక్ట‌ర్ స్ట్రేంజ్‌, స్పైడ‌ర్ మేన్‌:  ఫార్ ఫ్ర‌మ్ హోమ్‌, ఎవెంజ‌ర్స్:  ఇన్ఫినిటీ వార్ సినిమాల‌కు ప‌నిచేశారు క్రిస్‌.

దుల్క‌ర్‌... ది కింగ్ ఆఫ్ కోతా

దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టిస్తున్న సినిమా కింగ్ ఆఫ్ కోతా. ఈ సినిమా క్లైమాక్స్ పోర్ష‌న్ బాగా రాలేద‌ని, మ‌ళ్లీ రీ షూట్ చేయాల‌ని మేక‌ర్స్ అనుకుంటున్న‌ట్టు ఈ మ‌ధ్య వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. అప్ప‌టి నుంచే ఈ సినిమా మీద వేరే లెవ‌ల్ ఎక్స్ పెక్టేష‌న్స్ పెరిగాయి. ఇప్పుడు ఈ సినిమా ఫ‌స్ట్ మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్ అయింది. అందులోని ప్ర‌తి బిట్ చాలా బావుంది. మేక‌ర్స్ ఎడ్జీ కేర‌క్ట‌ర్‌ని క‌ట్ చేసిన విధానం చూసి సోష‌ల్ మీడియాలో ఫ్యాన్స్ ఎగ్జ‌యిటింగ్‌గా ఉన్నారు. కేర‌క్ట‌ర్ అనౌన్స్ మెంట్ వీడియోలో కింగ్ ఆఫ్ కోతాకి సంబంధించిన ప‌లు కీ కేర‌క్ట‌ర్ల‌ను ప‌రిచ‌యం చేశారు. అది కూడా చాలా కొత్త‌గా ఉంది. స్కెచ్ ఫార్మాట్‌లో అలాంటివి క‌నిపించ‌డం కొత్త‌గా అనిపించాయి. దుల్క‌ర్ స‌ల్మాన్ కింగ్ లుక్‌లో రిఫ్రెషింగ్‌గా క‌నిపించారు.

సెట్‌కి లేట్‌గా వ‌చ్చాడ‌ని హీరోని తిట్టిన కియారా!

పెళ్ల‌వ‌డానికి ముందూ, పెళ్లి త‌ర్వాత కెరీర్ ప‌రంగా ఏమాత్రం తేడా లేని నాయిక కియారా అద్వానీ. వెకేష‌న్‌కి వెళ్లొచ్చినంత తేలిగ్గా మ్యారేజ్‌ని ప్లాన్ చేసి, కంప్లీట్ చేసుకుని, మ‌ళ్లీ ప‌నిలో ప‌డిపోయారు కియారా. ఆమె న‌టించిన స‌త్య ప్రేమ్ కీ క‌థ సినిమా ఈ నెల్లోనే విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా ఆమె ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్‌లో పాల్గొన్నారు.  హీరో కార్తిక్ ఆర్య‌న్ గురించి అభిమానుల‌తో చాలా విష‌యాల‌ను పంచుకున్నారు. కియారా మాట్లాడుతూ ``కార్తిక్ తో ఇంత‌కు ముందు భూల్ భుల‌య్యా2లో న‌టించాను. ఆ స‌మ‌యంలో ప్ర‌తి రోజూ కార్తిక్ సెట్‌కి లేట్‌గా వ‌చ్చేవాడు. నాకు చిరాకు వ‌చ్చేసేది. ఒక‌రోజు గ‌ట్టిగా తిట్టాను. ఇంతింత సేపు న‌న్ను వెయిట్ చేయిస్తే బాగోద‌ని అన్నాను. భూల్ భుల‌య్యా కాంబోని రిపీట్  చేస్తామ‌ని నా ద‌గ్గ‌ర‌కు ప్ర‌పోజ‌ల్ వ‌చ్చిన‌ప్పుడు కూడా నేను కార్తిక్ కి అదే విష‌యం చెప్పాను.