English | Telugu
బాగా బిజీ అవుతున్న దీపిక పార్ట్‌నర్!
Updated : Jul 2, 2023
దీపిక భర్త రణ్‌వీర్‌గానే కాదు, ఫ్యాషన్ స్టైల్ ఐకాన్‌గా మనకు రణ్‌వీర్ సింగ్ గురించి బాగా తెలుసు. ఆయన సినిమాల్లోని కేరక్టర్లు ఎంత ఫేమస్సో, డిఫరెంట్ కాస్ట్యూమ్స్ తో ఆయన చేసే ఫొటో షూట్లు కూడా అంతే ఫేమస్.
ప్రస్తుతం కరణ్‌జోహార్ మూవీ రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ మూవీతో బిజీగా ఉన్నారు రణ్‌వీర్‌సింగ్. ఆయన పక్కన ఆలియా నటిస్తున్నారు. రణ్‌వీర్ కెరీర్‌లో రీసెంట్ టైమ్స్‌లో బెస్ట్ రొమాంటిక్ సినిమా ఇది అని అంటున్నారు బాలీవుడ్ జనాలు. ఇటీవల విడుదల చేసిన కశ్మీర్‌లో తెరకెక్కించిన సాంగ్‌కి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్.
కరణ్ జోహార్‌తో ఉన్న ఫ్రెండ్‌షిప్‌తో రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ టీజర్‌ని రిలీజ్ చేశారు షారుఖ్. ఇంతే కాదు, ఇంతకు మించి మరో విషయంలో షారుఖ్‌ని, రణ్‌వీర్‌ని కంపేర్ చేస్తున్నారు జనాలు.
2011లో షారుఖ్ నించిన సినిమా డాన్2. ఈ సినిమాకు థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ వస్తుందనే ప్రచారం గట్టిగా జరిగింది. ఈ సినిమా కోసం ఫరాన్ అక్తర్ స్క్రిప్ట్ రాయడంలో బిజీగా ఉన్నారనే వార్తలు కూడా వినిపించాయి. అయితే ఇటీవల ఆ లైన్ తెలుసుకున్న షారుఖ్, థర్డ్ పార్ట్ మీద పెద్దగా ఆసక్తి లేదని చెప్పారని టాక్. పైగా, తనకు చేతినిండా సినిమాలున్నాయి. వరుస సినిమాలతో హెక్టిక్‌గా ఉండటంతో, ఇప్పట్లో కాల్షీట్ కేటాయించడం కూడా పెద్దగా కుదరని పని అని అన్నారు. దాంతో, ఈ ఆఫర్ రణ్‌వీర్ సింగ్‌ని వెతుక్కుంటూ వెళ్లినట్టు సమాచారం. ఫరాన్ చెప్పిన కథ నచ్చడంతో వెంటనే రణ్‌వీర్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారని టాక్.
ఈ విషయం గురించి త్వరలోనే అఫిషియల్‌గా ప్రకటిస్తారు. ఆల్రెడీ షారుఖ్ ప్రూవ్ చేసిన కేరక్టర్‌ని రణ్‌వీర్ కొత్తగా ఎలా డీల్ చేస్తారనే ఆసక్తి కనిపిస్తోంది మూవీ గోయర్స్‌లో.