English | Telugu

గ‌ద‌ర్ ఈజ్ బ్యాక్ అంటున్న ఫ్యాన్స్

పాకిస్తానీ అల్లుడు స‌న్నీడియోల్ అలియాస్ తారా సింగ్ ఈజ్ బ్యాక్ అంటున్నారు ఫ్యాన్స్. సూప‌ర్ హిట్ సినిమా గ‌ద‌ర్‌:  ఏక్ ప్రేమ్ క‌థ‌కి సీక్వెల్ అనౌన్స్ అయిన‌ప్ప‌టి నుంచే ఫ్యాన్స్ లో బ‌జ్ మొద‌లైంది. గ‌ద‌ర్‌2 సెట్స్ నుంచి పిక్స్ రిలీజ్ అయిన ప్ర‌తిసారీ ప్రేక్ష‌కులకు మ‌రింత ఆస‌క్తిని క్రియేట్ చేసేవి. ఇప్పుడు విడుద‌లైన టీజ‌ర్‌కి కూడా చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. స‌న్నీడియోల్‌, అమీషా ప‌టేల్ జంట‌గా న‌టించిన ఫ‌స్ట్ పార్ట్ ని ఇటీవ‌ల థియేట‌ర్ల‌లో విడుద‌ల చేశారు. ఫ‌స్ట్ పార్ట్ మ‌ళ్లీ చూసిన వారు సీక్వెల్ టీజ‌ర్ కోసం ఈగ‌ర్‌గా వెయిట్ చేశారు. టీజ‌ర్ 1971 బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కింది. మ్యాచో స్టార్ స‌న్నీ డియోల్ సినిమాలో తారా సింగ్‌గా మెప్పిస్తున్నారు. బాగా పెరిగిన బ్రౌన్ గ‌డ్డం, కుర్తా పైజామా, మెడ చుట్టూ ట‌ర్బ‌న్‌తో క‌నిపించారు స‌న్నీడియోల్‌. టీజ‌ర్‌లో స‌కీనా (అమీషా ప‌టేల్‌) క‌నిపించ‌లేదు. పాపులర్ సాంగ‌గ్ ఉద్ జ కాలే క‌వా పాట మాత్రం ఎండింగ్‌లో వినిపించింది.

భార‌త వ‌నిత గురించి ప్ర‌పంచానికి చెప్తానంటున్న రాణి!

రాణి ముఖ‌ర్జీ పేరు విన‌గానే ఒక ర‌క‌మైన పాజిటివ్ వైబ్రేష‌న్ వచ్చేస్తుంది ఎవ‌రికైనా. ఎప్పుడూ చిరున‌వ్వులు చిందిస్తూ ఉంటారు. అలాగ‌ని స్క్రీన్ మీద కూడా అంతే ఈజీగా ఉంటార‌నుకుంటే పొర‌పాటు. చాలెంజింగ్ రోల్స్ టేక‌ప్ చేసి, రాణి ఈజ్ ఆల్వేస్ గ్రేట్ అనిపించుకుంటూ ఉంటారు. అలాంటి రాణిముఖ‌ర్జి త‌న మ‌న‌సులోని మాట‌ల‌ను బ‌య‌ట‌పెట్టారు. ``సొసైటీలో ఏ మార్పైనా మ‌హిళ‌ల‌తో సాధ్య‌మ‌ని నా న‌మ్మ‌కం. నా న‌మ్మ‌కాన్నే నేను స్క్రీన్ మీద చూపిస్తాను. గ్లాస్ సీలింగ్‌ని తొల‌గించే వైవిధ్య‌మైన పాత్ర‌లంటే ఇష్టం. జీవితంలో ఎన్నో సాధించిన మహిళ‌లు ఎంతో మంది ఉన్నారు. అలాంటివారి గురించి భావి త‌రాల‌కు చెప్పాలి. అంత‌క‌న్నా ముందు ఈ ప్ర‌పంచానికి వారిని ప‌రిచ‌యం చేయాలి. అలాంటి క‌థ‌ల‌తో సినిమాలు చేయాల‌ని ఉంది. మ‌న జాతినిర్మాణంలో పాలుపంచుకున్న ప్ర‌తి మహిళ‌దీ ప్ర‌త్యేక క‌థేన‌న్న‌ది నా న‌మ్మ‌కం`` అని అన్నారు.

అక్ష‌య్ జాలీ ఎల్ ఎల్ బీ: లేటెస్ట్ అప్‌డేట్‌

ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ ఆర్టిస్టుల్లో అర్ష‌ద్ వార్సీ ఒక‌రు. అసుర్ సీజ‌న్‌2 ఓటీటీల్లో దున్నేస్తుండ‌టంతో అర్ష‌ద్ వ‌ర్సీ ఆనందానికి అవ‌ధుల్లేవు. అర్ష‌ద్ వ‌ర్సీకి చేతినిండుగా ప్రాజెక్టులున్నాయి. అయితే ఆయ‌న న‌టించిన సినిమాల సీక్వెల్ సంగ‌తులేంట‌న్న‌ది ఫ్యాన్స్ ని ఊరిస్తున్న విష‌యం. మున్నాభాయ్‌3, జాలీ ఎల్ ఎల్ బీ3, గోల్‌మాల్5, ధ‌మాల్‌4 వంటివ‌న్నీ జ‌నాల ఆద‌ర‌ణ పొందిన సినిమాలే. వీటి గురించి అర్ష‌ద్ వ‌ర్సీ చాలా విష‌యాల‌నే చెప్పుకొచ్చారు. ``మున్నాభాయ్ 3 ఉండ‌దు. సంజ‌య్‌, నేనూ ఉండాల‌నే కోరుకున్నాం. రాజు హిరానీ కూడా చేయాల‌నే అనుకున్నారు. విధు  వినోద్ చోప్రా నిర్మించ‌డానికి రెడీ అయ్యారు. అయినా, ఇప్ప‌టికి అది అవ్వ‌దు. జాలీ ఎల్ ఎల్ బీ 3 మాత్రం ఉంటుంది. 

ద‌స‌రాకి రెడీ అవుతున్న టైగ‌ర్‌... అందుకోగ‌ల‌రా?

ద‌స‌రాకి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ బొమ్మ ప‌డాల్సిందే. ఫ్యాన్స్ విజిల్స్ తో స్క్రీన్ మీద ఫైర్ పుట్టాల్సిందే అంటూ గ‌ట్టిగా సంక‌ల్పించుకున్నారు టైగ‌ర్‌. ఈసారి ద‌స‌రాను మిస్ చేసుకునే ఛాన్సే లేద‌న్న‌ది టైగ‌ర్ నుంచి వ‌స్తున్న మాట‌. మ‌రి ఇప్పుడే క‌దా దేవ‌ర సినిమా స్టార్ట్ అయింది. మ‌రి అప్పుడే ఎలా కుదురుతుంది? 2024 రిలీజ్ అని చెప్పేశారు క‌దా. అలాంట‌ప్పుడు ఇంత తొంద‌ర‌పెట్ట‌డం కూడా స‌రికాదు అని కొంద‌రంటే, ఏ హిట్ మూవీనో ద‌స‌రాకి రీరిలీజ్ చేస్తారేమో అనే అనుమానాలు మ‌రికొంద‌రివి. కాక‌పోతే ఇక్క‌డే ఒక చిన్న ట్విస్ట్. ఇక్క‌డ ద‌స‌రాకు రావాల‌నుకుంటున్న టైగ‌ర్ మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కాదు, నార్త్ హీరో టైగ‌ర్ ష్రాఫ్‌.