English | Telugu

ఆండ్రియా న్యూడ్ సీన్స్ తీసేశారా!

షో బిజ్‌లో బోల్డ్ గా క‌నిపించే న‌టీమ‌ణుల్లో ఆండ్రియా జెరీమియా ఒక‌రు. ఆమె ఏ సినిమా చేసినా సెన్సేష‌నే. ఏదో స్పెషాలిటీ ఉంటేగానీ మేక‌ర్స్ ఆమెను అప్రోచ్ అవ్వ‌రు. ఆ స్పెషాలిటీ న‌చ్చితేగానీ ఆండ్రియా ఓకే చెప్ప‌రు. ఇన్నేళ్లుగా త‌న‌కంటూ ఓ స్పెష‌ల్  స్టైల్‌ని ఫాలో అవుతున్నారు ఆండ్రియా జెరీమియా. ఇప్పుడు ఆమె ఓ టాపిక్‌తో ట్రెండ్ అవుతున్నారు. పిసాసు 2లో న‌టించారు ఆండ్రియా జెరీమియా. ఎప్పుడూ ఏదో ఒక కొత్త విష‌యాన్ని ఆడియ‌న్స్ కి త‌న సినిమాల ద్వారా చెప్పాల‌నుకుంటారు డైర‌క్ట‌ర్ మిస్కిన్‌. ఆయ‌న‌తో క‌లిసి ఆండ్రియా చేసిన సినిమా పిసాసు2. 2014లో రిలీజ్ అయిన సెన్సేష‌న‌ల్ సినిమాకు ఇది సీక్వెల్‌. హార‌ర్ ప్ర‌ధానంగా సాగుతుంది ఈ మూవీ. ఈ సినిమాలో ఆండ్రియా న్యూడ్‌గా న‌టించారంటూ ఆల్రెడీ వార్త‌లు స్ప్రెడ్ అయ్యారు. 2018లో విడుద‌లైన వ‌డ చెన్నై మూవీలో టాప్‌లెస్ సీన్ చేశారు ఆండ్రియా. వెట్రిమార‌న్ డైర‌క్ష‌న్‌లో ఆ సీన్లు చేయ‌డానికి అప్ప‌ట్లో తాను కంఫ‌ర్ట్ గానే ఫీల‌య్యాన‌ని బోల్డ్ స్టేట్‌మెంట్లు కూడా ఇచ్చారు.

ఐట‌మ్ సాంగ్‌కి నో చెప్పిన హ్యూమా

బాలీవుడ్ నటి హుమా ఖురేషి తర్లా చిత్రంలో సెలబ్రిటీ చెఫ్ తర్లా దలాల్ పాత్రను పోషించినందుకు ప్రశంసలు అందుకుంటున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో ఎదుర్కొన్న ప‌లు విష‌యాల గురించి ప్ర‌స్తావించారు. ఓ పాట‌లో లిరిక్స్ న‌చ్చ‌క‌పోవ‌డంతో ఓ ఐట‌మ్ సాంగ్‌కి నో చెప్పిన విష‌యాన్ని కూడా ఆమె ఈ సంద‌ర్భంగా చెప్పుకొచ్చారు.  ఐట‌మ్ సాంగ్ గురించి మాట్లాడుతూ ``ఓ ఐట‌మ్ సాంగ్‌లో డ్యాన్స్ చేయ‌మ‌ని ఆఫ‌ర్ వ‌చ్చింది. చాలా మంచి సినిమా. పెద్ద నిర్మాత‌. మంచి సాంగ్‌. విన‌గానే చార్ట్ బ‌స్ట‌ర్ అవుతుంద‌నిపించే ట్యూను. అన్నీ ఓకే అనుకున్నా. రెండు రోజులు రిహార్స‌ల్స్‌కి కూడా వెళ్లా. నాకోసం యూనిట్ కాస్ట్యూమ్స్ కూడా రెడీ చేశారు.

మెల్బోర్న్ ఫెస్టివ‌ల్‌లో ఘూమ‌ర్ ప్ర‌ద‌ర్శ‌న‌

ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ (IFFM)  14వ ఎడిషన్ అనౌన్స్ మెంట్ వ‌చ్చేసింది. ఆగ‌స్టు 11 నుంచి 20 వ‌ర‌కు ఈ ఫెస్టివల్ జ‌ర‌గ‌నుంది. ఈ చ‌ల‌న‌చిత్రోత్స‌వానికి ఈ సారి ఆర్ బాల్కీ సినిమా ఘూమ‌ర్ ఎంపికైంది. అభిషేక్ బచ్చన్, సయామి ఖేర్, అంగద్ బేడి మరియు షబానా అజ్మీ నటించిన మూవీ ఘూమర్‌. అభిషేక్ బచ్చన్ కోచ్‌గా క‌నిపిస్తారు. తన కోచ్ మార్గదర్శకత్వంలో క్రికెటర్‌గా రాణించిన అమ్మాయిగా సయామి ఖేర్ క‌నిపిస్తారు. ఆర్ బాల్కీ, అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ ``మెల్బోర్న్ ఫెస్టివ‌ల్‌లో ఘూమర్ ఓపెనింగ్ మూవీ కావడం నిజంగా మాకు గౌరవంగా ఉంది. ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితుల‌ను కూడా అడ్వాంటేజ్‌గా మార్చుకునే  కథే ఘూమర్. ప‌డ్డ‌ప్పుడు లేవాల‌ని చెప్పే క‌థ ఇది`` అని అన్నారు.

అట్లీ సిగ్నేచర్ స్టైల్లో జవాన్

షారుక్ ఖాన్ కథానాయకుడిగా నటించిన సినిమా జవాన్. జవాన్ ప్రివ్యూ ఇవాళ విడుదలైంది. అట్లీ దర్శకత్వం వ‌హిస్తున్న సినిమా ఇది. ఈ ప్రివ్యూ చూసిన ప్రేక్షకులు అట్లీ గత చిత్రాల స్టైల్ జవాన్ లో కూడా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అట్లీ సినిమాల్లో ఎప్పుడూ గ్రాండ్ సెట్స్, క్యారెక్టర్ లో భిన్న కోణాలు, అసలు ఎవరి ఊహకి అందని హీరోయిజం ఉంటాయి. ఇలాంటి విషయాలన్నీ జ‌వాన్‌లోనూ ఉన్నాయి. జవాన్ చూసిన వాళ్ళందరూ అట్లీ సినిమాల్లోని ఈ లక్షణాలన్నీ ఇందులోనూ కనిపిస్తున్నాయని అంటున్నారు. నార్త్లో తరికెక్కించినప్పటికీ తన ఒరిజినల్ స్టైల్ ని అట్లీ మిస్ చేయలేదని ప్రశంసిస్తున్నారు. నయనతార, విజయ్ సేతుపతి కీలకపాత్రల్లో నటించిన సినిమా జవాన్.