English | Telugu
క్రిస్‌మస్‌కి పలకరిస్తానంటున్న సీత
Updated : Jun 19, 2023
ఆదిపురుష్ తో కలెక్షన్లు కొల్లగొడుతున్న సీతమ్మ కృతిసనన్. జానకి కేరక్టర్‌లో మెప్పించారు కృతి. కథాపరంగా భిన్న అభిప్రాయాలున్నా, సీత కేరక్టర్‌కి కృతి న్యాయం చేశారనే అంటున్నారు మెజారిటీ ప్రేక్షకులు. ఆల్రెడీ ఈ ఏడాది కృతికి ఇది రెండో రిలీజ్. 2023 డిసెంబర్‌లో మరో రిలీజ్‌కి సిద్ధమవుతున్నారు మిస్ సనన్. షాహిద్ కపూర్ సరసన ఆమె ఓ సినిమా చేశారు. రొమాంటిక్ కామెడీ తరహా సినిమా ఇది. కృతి, షాహిద్ ఇద్దరూ గతంలో ఈ తరహా సినిమాలు చేశారు. అయితే వీరిద్దరూ ఆన్‌స్క్రీన్ ఇలా రావడం మాత్రం ఫస్ట్ టైమ్. ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచీ, బైక్ మీద వీరిద్దరూ కూర్చున్న పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుంచీ ఆడియన్స్ ఆసక్తిని కనబరుస్తున్నారు.
డిసెంబర్ 7న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. మ్యాడాక్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది ఈ మూవీని. ``మీ క్యాలండర్లలో మార్క్ చేసుకోండి. డిసెంబర్ 7న మా సినిమా వస్తుంది. ఈ సారి క్రిస్‌మస్ ముందే రాబోతోంది. జియో స్టూడియోస్, దినేష్ విజన్ సమర్పిస్తున్నారు`` అని అన్నారు. ఈ సినిమాకు అమిత్ జోషి, ఆరాధన సహ్ దర్శకులు. ఈ చిత్రంలో వెటరన్ ఆర్టిస్ట్ ధర్మేంద్ర, డింపుల్ కపాడియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యాన్ ఇంపాజిబుల్ లవ్‌స్టోరీ అంటూ వైరల్ అవుతోంది మూవీ పోస్టర్.