కార్తిక్ - కరణ్ కలిసిపోయినట్టేనా?
కార్తిక్ ఆర్యన్, కరణ్ జోహార్ ఇద్దరూ కలిసిపోయినట్టేనా? వారిద్దరి మధ్య అంతా సవ్యంగానే ఉందా? ఇప్పుడు బాలీవుడ్‌లో జరుగుతున్న డిస్కషన్ అంతా దీని గురించే. అందుకే వీరిద్దరి పేర్లు హెడ్‌లైన్స్ లో మారుమోగుతున్నాయి. ముంబైలోని ఓ ఖరీదైన భవనం నుంచి కార్తిక్ ఆర్యన్, కరణ్ జోహార్ బయటకు వెళ్లడంతో వారిద్దరి మధ్య అంతా పర్ఫెక్ట్ గా ఉందనే మాటలు వినిపిస్తున్నాయి. దోస్తానా 2 నుంచి కార్తిక్ ఎగ్జిట్ అయ్యాడనే మాటలకు ఇప్పుడు ఫుల్‌స్టాప్ పడ్డట్టయింది. దోస్తానా 2 ఆగిపోయిందని,కరణ్ జోహార్‌తో చెడటం వల్లనే ఆ ప్రాజెక్ట్ నుంచి కార్తిక్ తప్పుకున్నారని చాలా వార్తలువచ్చాయి. అయితే కార్తిక్‌గానీ, కరణ్‌గానీ దీని గురించి ఎప్పుడూ పెదవి విప్పలేదు. అయితే, ఇప్పుడు వీరిద్దరూ కలిసింది దేనికోసం? దోస్తానా 2 చేస్తారా? లేకుంటే, దాన్ని పక్కన పెట్టి సరికొత్త ప్రాజెక్టును టేకప్ చేస్తారా? అనేది కూడా ఆలోచించాల్సిన విషయం.