English | Telugu
పెళ్లి గురించి మాట్లాడిన అనన్య!
Updated : Jul 2, 2023
అనన్య డేటింగ్ గురించి, పెళ్లి గురించి సౌత్ మీడియాలోనూ జోరుగానే డిస్కషన్ జరుగుతోంది. లైగర్ సినిమా సక్సెస్ అయి ఉంటే, సౌత్‌లో అనన్య రేంజ్ ఇంకో రేంజ్లో ఉండేది. ఆ సినిమా మీద చాలా హోప్సే పెట్టుకున్నారు అనన్య. ఈ బ్యూటీ మాత్రమే కాదు, సౌత్ మేకర్స్, ఆడియన్స్ కూడా ఆమె నియర్ ఫ్యూచర్లో స్టార్స్ అందరి పక్కనా నటించడం ఖాయం అనుకున్నారు. అయితే లైగర్ ఫ్లాప్ ఒక్కటీ... ఆమె కెరీర్‌ని మార్చేసింది. ఎట్ ప్రెజెంట్ నార్త్ లో కాస్త బిజీ అవుతున్నారు అనన్య.
ఉత్తరాదిన ఆమె చేస్తున్న ప్రాజెక్టుల కన్నా, ఆమె డేటింగ్ వార్తల మీద, పెళ్లి మీద ఎక్కువ ప్రచారం జరుగుతోంది. ఆదిత్య రాయ్ కపూర్‌తో అనన్య ప్రేమలో ఉన్నారన్నది ఎప్పటి నుంచో వార్తల్లో నలుగుతున్న విషయం. దీని గురించి ఆదిత్య రాయ్ కపూర్ ఇప్పటిదాకా నోరు విప్పలేదు. కానీ హాటెస్ట్ కపుల్‌గా వారిద్దరూ ఎక్కడికి వెళ్లినా పాపరాజీలు వెంటపడుతున్నారు. వాళ్ల మధ్య కెమిస్ట్రీ సూపర్బ్ అంటూ ఫ్యాన్స్ హ్యాపీ నోట్స్ షేర్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో పెళ్లి గురించి మాట్లాడారు అనన్య పాండే. "నేనింకా చిన్నపిల్లను. నాకు ఇప్పుడప్పుడే పెళ్లి ఏంటి? పెళ్లి చేసుకోవడం తప్పన్నది నా ఉద్దేశం కాదు. కాకపోతే నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. రూమర్స్ గురించి పట్టించుకుంటే చాలానే వినాల్సి వస్తుంది. మనసుకు నచ్చింది చేయలేం. నటిగా చాలా హద్దుల్లో ఉంటాను. స్వేచ్ఛగా ఎక్కడికి వెళ్లాలన్నా వెళ్లలేను. అయినా కొన్ని సందర్బాల్లో అయినా మనసుకు నచ్చినట్టు ఉండకపోతే ఎలా? అందుకే నచ్చిన వాళ్లతో సరదాగా బయటకు వెళ్తుంటాను. దాన్ని చూసి కథలు అల్లుకుంటే నాకేం సంబంధం" అని అన్నారు.
కరణ్ జోహార్ షోలో తొలిసారి ఈ జంట ప్రేమ గురించి ప్రస్తావన వచ్చింది. కృతి సనన్ దివాలీ పార్టీకి కూడా వీరిద్దరూ కలిసే వెళ్లడంతో రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. ఫిఫా వరల్డ్ కప్ 2022, సెమీ ఫైనల్ దోహాలో జరిగినప్పుడు వీరిద్దరూ కలిసి కనిపించడంతో న్యూస్ వైరల్ అయింది.