English | Telugu
దిగులు పడుతున్న రష్మిక... మూవీ వాయిదా!
Updated : Jul 2, 2023
ఈ ఆగస్టులో బాలీవుడ్‌లో మాస్ హీరోయిన్‌గా ప్రూవ్ చేసుకోవాలని అనుకున్నారు నేషనల్ క్రష్ రష్మిక. అయితే, ఇప్పుడు ఆమె ఆశలు వాయిదా పడ్డాయి. దానికి రీజన్ ఆమె నటించిన 'యానిమల్' సినిమా వాయిదా పడటమే. మొదటి నుంచీ స్టెప్ బై స్టెప్ అనుకున్నది అనుకున్నట్టు చేస్తున్నారు రష్మిక మందన్న. ప్రతిదీ నేర్చుకుంటూ, ట్రయల్ అండ్ ఎర్రర్స్ చేసుకుంటూ, పర్ఫెక్షన్ వైపు అడుగులు వేస్తున్నారు. ఫ్యాషన్ ఇండస్ట్రీ అయినా, గ్లామర్ ఇండస్ట్రీ అయినా సాధన చేస్తే తప్పక సక్సెస్ అవుతామనే కాన్ఫిడెన్స్ ఆమెది.
రష్మిక నటించిన లేటెస్ట్ బాలీవుడ్ సినిమా 'యానిమల్'. రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించారు. 'కబీర్ సింగ్' తర్వాత సందీప్ రెడ్డి వంగా అక్కడ డైరక్ట్ చేస్తున్న మూవీ ఇది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. అన్నీ బావుంటే ఆగస్టు 11న విడుదల కావాల్సింది. రీసెంట్ గా రివీల్ చేసిన ప్రీ టీజర్ కూడా సినిమా మీద హైప్ క్రియేట్ చేసింది. ఇండిపెండెన్స్ వీక్‌లో సిల్వర్ స్క్రీన్స్ మీద రక్తం ఏరులైపారుతుందని ప్రీ టీజర్ చూసిన నెటిజన్లు కామెంట్ చేశారు. అయితే ఇప్పుడు అలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ కి ఫుల్ స్టాప్ పడింది. రణ్‌బీర్ నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్‌కి పోస్ట్ పోన్ అయిందని టాక్. ఈ విషయాన్ని టీసీరీస్ భూషణ్ కుమార్ త్వరలోనే ప్రకటిస్తారనే వార్త ముంబైలో వైరల్ అవుతోంది.
అనిల్ కపూర్, బాబీ డియోల్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఆల్రెడీ ఫుల్ జోష్‌లో ఉన్నారు రణ్‌బీర్ కపూర్. ఈ సినిమా సక్సెస్ అయితే ఆయనకు హ్యాట్రిక్ హిట్ అందినట్టే.
బాలీవుడ్‌లో ఇప్పటిదాకా పలు ప్రాజెక్టులు చేశారు రష్మిక మందన్న. అయితే అక్కడ ఆమెను సూపర్‌డూపర్ సక్సెస్ పలకరించలేదు. అలాగని అట్టర్ ఫ్లాప్ హీరోయిన్ అనే నెగటివ్ ఇమేజ్ కూడా లేదు. బ్లాక్ బస్టర్ హిట్ వస్తే తప్ప, బాలీవుడ్ జనాలను అట్రాక్ట్ చేసే పొజిషన్ కూడా లేదు.