English | Telugu
రెండు నెలలు బ్రేక్ ఇచ్చిన పృథ్విరాజ్!
Updated : Jun 27, 2023
పృథ్విరాజ్ సుకుమారన్ రెండు నెలలు సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. అందుకు కారణం ఆయన హెల్త్ రీజన్స్. ఆయనకు సోమవారం సర్జరీ జరిగింది. విలాయత్ బుద్ధ సినిమా షూటింగ్ సమయంలో ఆయనకు యాక్సిడెంట్ జరిగింది. అందుకే ఆయనకు కొచ్చిలోని ప్రైవేట్ హాస్పిటల్‌లో లెగ్ సర్జరీ చేశారు. వైద్యుల సలహా మేరకు ఆయన రెండు నెలలు సినిమాలకు దూరంగా రెస్ట్ గా ఉండాలి. కొన్ని వారాల పాటు బెడ్ రెస్ట్ మాత్రం కచ్చితంగా తీసుకోవాల్సిందే. ఇంకో రెండు రోజుల్లో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతారు. ఆ తర్వాత కూడా షూటింగులకు రెండు నెలలు దూరంగా ఉంటారు. పృథ్వి గాయపడటం వల్ల ఇమీడియేట్ ఎఫెక్ట్ సలార్‌కేనని అంటున్నారు జనాలు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా సలార్ సినిమా చేస్తున్నారు పృథ్వి. ఈ సినిమాలో ఆయన పోర్షన్ కంప్లీట్ అయిందా? లేదా? అనేదాని మీద ఇప్పటిదాకా క్లారిటీ లేదు. కాబట్టి డార్లింగ్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ పృథ్వి పోర్షన్ కంప్లీట్ కాకపోతే,సినిమా రిలీజ్ వాయిదా పడే ప్రమాదం ఉందన్నది అందుతున్న చేదువార్త. ఈ సినిమాతో పాటు బాలీవుడ్‌లో బడేమియా చోటే మియాలో నటిస్తున్నారు పృథ్వి. ఇందులో మెయిన్ విలన్ కేరక్టర్‌లో నటిస్తున్నారు. అక్షయ్‌కుమార్, టైగర్ ష్రాఫ్ నటించే ఈ సినిమాలో మెయిన్ విలన్ సౌత్ నుంచి ఉంటే బావుంటుందని అనుకున్నప్పుడు అందరి దృష్టీ పృథ్విరాజ్ మీదే పడిందట. అలీ అబ్బాస్ జాఫర్ అద్భుతమైన డెసిషన్ తీసుకున్నారని అప్పట్లో నెట్టింట్లో ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ సినిమాలతో పాటు లూసిఫర్ సీక్వెల్ ఎల్2 ఎంపురాన్‌ని కూడా డైరక్ట్ చేస్తున్నారు పృథ్విరాజ్. ఇప్పుడు యాక్సిడెంట్ వల్ల ఈ సినిమాలన్నీ డిలే అయ్యే ప్రమాదం ఉంది. పృథ్వి నటించిన ఆడుజీవితం రిలీజ్‌కి రెడీ అవుతోంది.