English | Telugu

మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ చేతిలో నాలుగు సినిమాలు!

ఆమిర్ ఖాన్ ప్రొడ‌క్ష‌న్స్ ఇప్పుడు స్టూడియో మోడ‌ల్‌లో వ‌ర్క్ చేస్తోంది. ఒక‌టికి నాలుగు సినిమాల‌తో బిజీగా ఉన్నారు మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్. ల‌పాటా లేడీస్‌, ప్రీత‌మ్ ప్యారే, చాంపియ‌న్స్ రీమేక్‌, జ‌య జ‌య జ‌య జ‌య‌హే రీమేక్ ఆయ‌న అండ‌ర్‌లోనే జ‌రుగుతున్నాయి. ఫ్యామిలీకి కాస్త స‌మ‌యం కేటాయించాలి. నిర్మాత‌గా స్ట్రాంగ్‌గా నిల‌బ‌డాలి. అందుకే నేను కెరీర్‌కి బ్రేక్ తీసుకుంటున్నా అని గ‌త అక్టోబ‌ర్‌లో ఆమీర్‌ఖాన్ ప్ర‌క‌టించారు. అప్ప‌టి నుంచి మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ ప‌లు సెల‌బ్రేష‌న్స్ చేస్తూనే ఉన్నారు. ఆయ‌న యాక్టింగ్ కెరీర్ గురించి మాత్రం ఎలాంటి కాంక్రీట్ అప్ డేట్ ఇవ్వ‌లేదు. అయితే ఇటీవ‌ల ఆమీర్‌ని ఫ‌ర్హాన్ అక్త‌ర్ క‌లిశారు. స్పానిష్ సినిమా చాంపియన్స్ కోసం ఫ‌ర్హాన్‌ని ఆమీర్ అప్రోచ్ అయ్యార‌న్న‌ది టాక్‌. ఈ సినిమా ఈ ఏడాది అక్టోబ‌ర్‌లో సెట్స్ మీద‌కు వెళ్తుంది. ఆర్ ఎస్ ప్ర‌స‌న్న ఈ సినిమాకు డైర‌క్ట్ చేస్తారు.

ల‌స్ట్ స్టోరీస్ 3 ఆన్ కార్డ్స్!

రీసెంట్‌గా నెట్టింట్లో ట్రెండింగ్‌లో ఉన్న టాపిక్స్ లో ల‌స్ట్ స్టోరీస్ ఒక‌టి. ల‌స్ట్ స్టోరీస్ ఫ‌స్ట్ పార్ట్ కి అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. దాంతో సెకండ్ పార్ట్ చేశారు. రోనీ స్క్రూవాలా, ఆషి దువా సారా, నెట్ ఫ్లిక్స్ చేసిన ఈ ఒరిజిన‌ల్స్ కి ఎప్పుడూ జ‌నాల్లో క్రేజ్ ఉంటుంది. సెకండ్ పార్ట్ ని కొంక‌నా సేన్ శ‌ర్మ‌, ఆర్ బాల్కీ, సుజ‌య్ ఘోష్‌, అమిత్ ర‌వీంద్ర‌నాథ్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.  ఈ నాలుగు క‌థ‌ల్లో అంగ‌ద్ బేడీ, మృణాల్ ఠాకూర్‌, నీనా గుప్తా, విజ‌య్ వర్మ‌, త‌మ‌న్నా భాటియా, కాజోల్‌, కుముద్ మిశ్ర‌, తిలోత్త‌మ శోమ్‌, అమృత సుభాష్ న‌టించారు. ల‌స్ట్ స్టోరీస్ ఫ‌స్ట్ పార్ట్ తో పోలిస్తే, సెకండ్ పార్ట్ కి పెద్ద స్పంద‌న రాలేదు. పైగా టెస్ట్ డ్రైవ్ లాంటి డైలాగుల‌కు మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చింది.

మ‌గాళ్లు ర‌చ్చ చేయ‌క్క‌ర్లేదంటున్న విద్య‌!

విద్యాబాల‌న్ పేరు చెప్ప‌గానే, ఆమెకున్న స్పెష‌ల్ ఆడియ‌న్స్ టాపిక్‌తో ఆటోమేటిగ్గా క‌నెక్ట్ అయిపోతారు. ఆమె రెస్పాండ్ అయ్యే టాపిక్స్ అంత పెక్యులియ‌ర్‌గా ఉంటాయి. విద్యాబాల‌న్ న‌టించిన లేటెస్ట్ సినిమా నీయ‌త్‌. జులై 7న విడుద‌ల కానుంది. ఈ ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా చాలా విష‌యాలు చెప్పారు విద్య‌. నీయ‌త్ మూవీకి అనుమీన‌న్ డైర‌క్ట‌ర్‌.  ఈ సినిమా గురించి విద్యాబాల‌న్‌ మాట్లాడుతూ ``నా కెరీర్‌లో అత్య‌ద్భుత‌మైన అవ‌కాశాలు మ‌హిళా ప్రాధాన్య‌త‌గ‌ల సినిమాల రూపంలోనే వ‌చ్చాయి. కానీ పోస్ట్ ప్యాండ‌మిక్ ఈ సినిమాలు పెద్ద‌గా వర్క‌వుట్ కావ‌డం లేదు. ఒక అడుగు వెన‌క్కి ప‌డ్డ‌ట్టు అనిపిస్తోంది. అదే క‌మ‌ర్షియ‌ల్ సినిమాల విష‌యంలో హీరోలు అంత స్ట్ర‌గుల్ ప‌డాల్సిన అవ‌స‌రం లేదు.