English | Telugu

ఓటీటీకి వెళ్తున్న జాన్వీ మూవీ!

వ‌రుణ్ ధావ‌న్‌, జాన్వీ క‌పూర్ జంట‌గా న‌టించిన సినిమా బావ‌ల్‌. ఈ సినిమా ఇప్పుడు డిజిట‌ల్ బాట ప‌ట్టింది. జులైలో విడుద‌ల‌కు రెడీ అవుతోంది. ఈ విష‌యాన్ని వ‌రుణ్ ధావ‌న్ సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. బావ‌ల్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో జాన్వీ కిర్రాక్‌గా ఉన్నారంటున్నారు ఫ్యాన్స్. నితీష్ తివారి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న సినిమా బావ‌ల్‌. అక్టోబ‌ర్‌లో థియేట‌ర్ల‌లో విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. వ‌రుణ్‌, జాన్వీ ఫ‌స్ట్ టైమ్ ఆన్ స్క్రీన్ జోడీగా క‌నిపిస్తార‌న‌డంతో క్రేజ్ తెచ్చుకున్న మూవీ బావ‌ల్‌. ఈ ఏడాది అక్టోబ‌ర్‌లో థియేట‌ర్‌కే ఫిక్స‌య్యారు మేక‌ర్స్. కానీ, ఇప్పుడు స‌డ‌న్‌గా ఓటీటీలో వ‌చ్చే నెలో విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

గ‌ర్భ నేర్చుకున్న కియారా

కియారా అద్వానీ, కార్తిక్ ఆర్య‌న్ క‌లిసి న‌టిస్తున్న సినిమా స‌త్య ప్రేమ్ కీ క‌థ‌. ఈ నెల 29న విడుద‌ల కానుంది ఈ సినిమా. భూల్ భుల‌య్యా2 బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ త‌ర్వాత కియారా అద్వానీ, కార్తిక్ ఆర్య‌న్ న‌టించిన సినిమా స‌త్య ప్రేమ్ కీ క‌థ‌. ఫిల్మ్ పోస్ట‌ర్‌, ట్రైల‌ర్ ప్రామిసింగ్‌గా అనిపించాయి. మ్యూజిక‌ల్ ల‌వ్ స్టోరీ అని ఫిక్స‌య్యారు జ‌నాలు. ఈ సినిమా కోసం ప్ర‌త్యేకంగా గ‌ర్భ నృత్యం నేర్చుకున్నార‌ట కియారా. ఆమె కెరీర్‌లో ఫ‌స్ట్ టైమ్ ఆ నృత్యం చేశార‌ట‌. ఈ చిత్రంలో రెండు చోట్ల ఆమె నృత్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తార‌ట‌. చెప్పులు లేకుండా ఆమె చేసిన నృత్యానికి సెట్లో అంద‌రూ ఫిదా అయ్యార‌ట‌. ఇప్ప‌టికి విడుద‌లైన పాట‌ల్లో ఆమె ఎన‌ర్జీ అద్భుతం అంటూ పొగుడుతున్నారు నెటిజ‌న్లు. సినిమాలో ఫ‌స్ట్ పాట ప్లే అవుతున్న‌ప్పుడే హీరో, హీరోని చూస్తార‌ట‌. ఇందులో రెండో పాట డ్యూయ‌ట్‌. గ‌ర్భ పాట‌ల కోసం ప్ర‌త్యేకంగా రిహార్స‌ల్స్  చేశార‌ట‌. బ్యాక్ టు బ్యాక్ ఈ రెండు పాట‌ల‌ను, హెవీ కాస్ట్యూమ్స్ తో ఆ మె ఫినిష్ చేసిన తీరు సూప‌ర్బ్ అంటోంది యూనిట్‌.

సూర్య హిందీ డెబ్యూ... బాలీవుడ్‌లో క‌ర్ణుడిగా!

సూర్య గురించి  ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ట్రెండ్ అవుతోంది. బాలీవుడ్‌లో క‌ర్ణుడిగా న‌టించ‌డానికి సూర్య ఓకే చెప్పార‌న్న‌ది ఆ న్యూస్‌. రాకేష్ ఓంప్ర‌కాష్ మెహ్రా తెర‌కెక్కిస్తున్న క‌ర్ణ మూవీ కోసం సూర్య‌ను అప్రోచ్ అయ్యార‌ట‌. మ‌హాభార‌తం ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. రాకేష్ చెప్పిన స్క్రిప్ట్ కి సూర్య ఫిదా అయ్యార‌న్న‌ది టాక్‌. సౌత్‌లో మంచి మార్కెట్ ఉన్న హీరో సూర్య‌. త‌మిళ్‌కి మాత్ర‌మే ప‌రిమితం కాకుండా, తెలుగులోనూ మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న హీరో.ఆకాశం నీ హ‌ద్దురా ఆయ‌న‌కు నేష‌న‌ల్ అప్లాజ్ తెచ్చిపెట్టింది.