English | Telugu
ఫ్యాన్స్ కి గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ఫైటర్
Updated : Jun 27, 2023
హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న సినిమా ఫైటర్. ఈ సినిమా నుంచి ఫస్ట్ స్టిల్ రిలీజ్ అయింది. చూసిన ఫ్యాన్స్ గూస్‌బంప్స్ వస్తున్నాయని అంటున్నారు. పక్కా యాక్షన్ సినిమాకు సిసలైన కేరాఫ్ అని చెబుతున్నారు. హృతిక్ రోషన్, దీపిక పదుకోన్ జంటగా నటించిన సినిమా ఫైటర్. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 25న విడుదలకు రెడీ అవుతోంది. కౌంట్‌డౌన్ బిగిన్స్ అంటూ హృతిక్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో సూపర్‌డూపర్ స్టిల్‌ని షేర్ చేశారు. ఇందులో హృతిక్ పైలట్ జీ సూట్‌లో ఉన్నారు. గ్లవ్స్ వేసుకున్నారు. థ్రిల్లింగ్ యాక్షన్ మూవీకి పక్కాగా ప్రిపేర్ అవుతున్నట్టు కనిపించారు. కెమెరాకు వెన్ను చూపిస్తూ నిలుచున్నారు.
ఫైటర్‌కి ఇంకా ఏడు నెలలుంది. ఫైటర్`` అని పోస్ట్ చేశారు. గతంలోనూ ఫైటర్‌కి సంబంధించి కొన్నిటిని షేర్ చేసుకున్నారు. షూటింగ్‌కి ప్రిపేర్ కావడం, ఎయిర్‌ప్లెయిన్‌లో షూటింగ్‌కి వెళ్లడం వంటివాటిని పంచుకున్నారు హృతిక్. ఈ కేరక్టర్ కోసం హృతిక్ చాలా ప్రిపేర్ అయ్యారు. ఫిజికల్‌గానూ ఆ మార్పు కనిపిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన పిక్ షేర్ చేయగానే ఫ్యాన్స్ కామెంట్స్ తో ఇన్‌బాక్స్ ఫుల్‌చేసేశారు. సూపర్బ్ అంటూ మెచ్చుకుంటున్నారు. హృతిక్ ఈ కేరక్టర్‌కి పిక్చర్ పర్ఫెక్ట్ అని, మైండ్ బ్లోయింగ్‌గా ఉన్నారని మెచ్చుకుంటున్నారు ఫ్యాన్స్.