English | Telugu
ఆ విషయం తెలుసంటున్న జూనియర్ బచ్చన్
Updated : Jun 26, 2023
ఇప్పుడు సీనియర్ బచ్చన్ స్పీడ్ చూస్తుంటే, ఆయన ఇంట్లో యంగ్‌స్టర్స్ కూడా పోటీపడలేకపోతున్నారనే విషయం అర్థమవుతోంది. రోజుకో సినిమా సైన్ చేస్తున్నారు బిగ్ బీ. అయితే ఆయన తనయుడు అభిషేక్ మాత్రం చాలా స్లోగా ఉన్నారు. ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఐడెంటిటీని సంపాదించుకున్నారు జూనియర్ బచ్చన్ అభిషేక్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అభిషేక్ తన మనసులోని మాటలను చాలా పంచుకున్నారు. హౌస్‌ఫుల్ 3 తర్వాత తను కావాలనే స్టెప్ బ్యాక్ తీసుకున్నట్టు తెలిపారు. తన ఎంపిక గురించి మరోసారి పట్టించుకోవడానికే తాను అలా చేశానని అన్నారు అభిషేక్. ఆయన మాట్లాడుతూ ``నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి. చాలా డబ్బులు వచ్చాయి. చాలా సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అయినా నన్ను నేను ముందుకు నడిపించుకోవడంలో ఎక్కడో తడబడ్డాను.
ఆ విషయం నాకు బాగా అర్థమవుతూ ఉంటుంది. కొన్నిసార్లు కళ్లుమూసుకుని సినిమాలు సెలక్ట్ చేసుకోకూడదు. ఎందుకంటే మనం చేసే సినిమాలను ప్రేక్షకులు ఎంతో శ్రమపడి సంపాదించిన డబ్బుతో చూస్తారు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలని అనుకున్నాను. అప్పటికి నేను సంతకం చేసి, ఇంకా స్టార్ట్ చేయని సినిమాలకు సంబంధించిన అడ్వాన్సులను తిప్పి పంపేశాను. కొన్నాళ్ల తర్వాత మళ్లీ నాకు నేను తృప్తిపడ్డాక సినిమాల్లోకి వచ్చాను`` అని అన్నారు. 2018లో ఆయన చేసిన మన్మార్జియాన్ సినిమాలో సెకండ్ లీడ్ రోల్ చేశారు. ఇటీవల ఆయన దస్విలో నటించారు. బ్రెత్ ఇన్‌టు ద షాడోస్ సెకండ్ సీజన్ స్టార్ట్ చేశారు. ఈ ఏడాది అజయ్ దేవ్‌గణ్ బోళాలో కనిపించారు. ఆర్ బాల్కీ సినిమా ఝూమర్ కంప్లీట్ చేశారు. సూజిత్ సిర్కార్ అప్ కమింగ్ సినిమాకి ప్రిపేర్ అవుతున్నారు అభిషేక్.