కంగన ఆ టైప్ కాదంటున్న మాధవన్
హీరో చుట్టూ తిరిగి, నాలుగు పాటలు పాడి, నాలుగు మాటలు చెప్పి, అతను కొడితే కొట్టించుకుని అలిగి అక్కడి నుంచి వెళ్లిపోయే పాత్రల్లో కంగనను చూడలేం. అసలు ఆమె ఆ టైప్ ఆర్టిస్ట్ కానే కాదు అని అంటున్నారు మాధవన్. కంగనలాంటి అమ్మాయిలు సెలక్ట్ చేసుకునే రోల్స్ రేంజే వేరే స్థాయిలో ఉంటుందని చెప్పారు మాధవన్. తను వెడ్స్ మను, తను వెడ్స్ మను సీక్వెల్‌లో కలిసి నటించారు కంగన అండ్ మాధవన్. త్వరలో వీరిద్దరి కాంబినేషన్‌లో తమిళ్‌లో మరో సినిమా తెరకెక్కనుంది. సక్సెస్‌ఫుల్ కాంబో ఈజ్ బ్యాక్ అంటూ కోలీవుడ్‌లో ప్రచారం జోరుగా సాగుతోంది. త్వరలోనే మేకర్స్ సినిమా గురించి అనౌన్స్ చేయబోతున్నారట. మాధవన్‌కి కంగన మీద అపారమైన గౌరవం ఉంది.