English | Telugu
నీటిలో సల్మాన్, కత్రినా... సూపర్ యాక్షన్
Updated : Jun 26, 2023
సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ నటిస్తున్న సినిమా టైగర్ 3. ఈ సినిమాకు ఎవెంజర్స్ తో లేటెస్ట్ గా కనెక్షన్ కుదిరింది. యాక్షన్ కో ఆర్డినేటర్ క్రిస్ బర్నస్ ఈ సినిమా కోసం పనిచేయడానికి సిగ్నల్ ఇచ్చారు. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్శ్ లో వస్తున్న సినిమా టైగర్3. హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి. మార్వెల్స్ హిస్టారిక్ హిట్ ఎవెంజర్స్ ఎండ్ గేమ్‌కి పనిచేసిన క్రిస్ బర్నస్ ఇప్పుడు టైగర్ 3 కి పనిచేస్తున్నారు. మెరైన్ యాక్షన్‌ని కంపోజ్ చేయడంలో అతను సిద్ధహస్తుడు. ది బార్న్ అల్టిమేటమ్, ఐ యామ్ లెజెండ్, జోకర్, డాక్టర్ స్ట్రేంజ్, స్పైడర్ మేన్: ఫార్ ఫ్రమ్ హోమ్, ఎవెంజర్స్: ఇన్ఫినిటీ వార్ సినిమాలకు పనిచేశారు క్రిస్.
పఠాన్, వార్ ఫ్రాంఛైజీల కన్నా విభిన్నంగా ఉండనుంది టైగర్ 3. యష్‌రాజ్ ఫిల్మ్స్, మనీష్ శర్మ కలిసి ఆడియన్స్ కి మరపురాని సినిమాను గిఫ్ట్ ఇవ్వనున్నారు. నెవర్ సీన్ బిఫోర్ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఉంటుందని అన్నారు మేకర్స్. టైగర్ ట్రయాలజీలో వస్తున్న మూడో సినిమా టైగర్ 3 ఈ దీపావళికి విడుదల కానుంది. ఏక్ థా టైగర్, టైగర్ జిందా హైలను మరోసారి రీకాల్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఇందులో కత్రినా జోయాగా నటిస్తున్నారు. ఇమ్రాన్ హష్మి విలన్ రోల్ చేస్తారు. సల్మాన్ ఖాన్ నటించిన కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ ఇటీవల విడుదలైంది. బాక్సాఫీస్ దగ్గర దారుణంగా ఫెయిలైంది ఈ సినిమా. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 175 కోట్లు కలెక్ట్ చేసింది.