English | Telugu
సింగర్స్‌కు ఇది మంచి అవకాశం...డోంట్ మిస్
Updated : Aug 21, 2024
జీ తెలుగులో సరిగమప కొత్త సీజన్ తో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. గడిచిన 15 సీజన్లలో ఎంతోమంది గాయనీగాయకులను ప్రేక్షకులకు పరిచయం చేసింది ఈ సరిగమప. ‘సరిగమప సీజన్ 16- ది నెక్ట్స్ సింగింగ్ యూత్ ఐకాన్’ను ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ఆడిషన్స్ నిర్వహిస్తోంది. ఈ ఆదివారం అంటే ఆగస్ట్ 25 న హైదరాబాద్లో ఆడిషన్స్ నిర్వహిస్తోంది. 15 నుంచి 30 సంవత్సరాల వయసున్న గాయనీ గాయకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
ఈ ఆడిషన్స్ ఉదయం 9:00 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి. హైదరాబాద్లోని హిందూ మహిళా జూనియర్ కళాశాల, హిందూ పబ్లిక్ స్కూల్ దగ్గర, గోకుల్ థియేటర్ ఎదురుగా, సనత్ నగర్లో ఆడిషన్స్ జరగనున్నాయి. జీ తెలుగు సరిగమప సీజన్ 16 ఆడిషన్స్ కి సంబంధించిన మరిన్ని వివరాల కోసం 9154670067 నెంబర్కు కాల్ చేసి సంప్రదించవచ్చు. ఇంటరెస్ట్ ఉన్న వాళ్ళు ఆగస్టు 30 వరకు డిజిటల్ ఆడిషన్స్ ద్వారా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. పాట పాడిన వీడియోలను 9154670067 నెంబర్కి వాట్సాప్ లేదా ztsaregamapa@zee.com ఈమెయిల్ ద్వారా పంపవచ్చు.