లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న పునర్నవి..
పునర్నవి అంటే చాలు బిగ్ బాస్ ఇంట్లో రాహుల్ సిప్లిగంజ్ తో చేసిన అల్లరి గుర్తొస్తుంది. ఆమె చిన్న చిన్న పాత్రలు చేసి టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. కానీ బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చాక పునర్నవి ఫాలోయింగ్ పెరిగింది. బిగ్ బాస్ బ్యూటీగానే పునర్నవి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ ఒక్కరికి ఫ్యాన్ అయ్యింది. బిగ్ బాస్ హిస్టరీలో రాహుల్ పునర్నవి జోడికి వచ్చినంత క్రేజ్ ఏ బిగ్ బాస్ సీజన్ లోనూ ఎవరికీ అంతగా రాలేదు. వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ ని కూడా ప్రజలు, ఫాన్స్ యాక్సెప్ట్ చేశారు. అలాంటి పున్ను ఇప్పుడు కొన్ని త్రో బ్యాక్ పిక్స్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. "జీవితం నాకు మంచి, చెడు, అందం, ఆనందం వంటి ఎన్నో దశలను ఇచ్చింది. ఇక్కడ ప్రతి దశలోనూ నేనున్నాను" అని పోస్ట్ పెట్టింది.