ఇండియన్ ఐడల్ సీజన్ 3 నుంచి కేశవ్ రామ్ ఎలిమినేట్..
ఇండియన్ ఐడల్ సీజన్ 3 ఆహా ఓటిటి ప్లాటుఫారం మీద సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఐతే ఇప్పుడు ఈ సీజన్ లో ఒక్కొక్కరిగా ఎలిమినేట్ ఐపోతున్నారు. ఐతే ఇంతవరకు తన పాటలతో ఆకట్టుకున్న కేశవ్ రామ్ రీసెంట్ ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయ్యాడు. దాంతో కేశవ్ కి ఉన్న ఫాన్స్, ఆడియన్స్ షాక్ అయ్యారు. కేశవ్ సాంగ్స్ అంటే పడిచచ్చిపోయే ఫాన్స్ చాలామంది ఉన్నారు. ఆయన గాత్రం మృదుమధురంగా ఉంటుంది. కేశవ్‌కి ముందు, కుశాల్ శర్మ, హరి ప్రియ, రాంజీ శ్రీపూర్ణిమ, శ్రీధృతి, అభిగ్న, సాయి వల్లభ ఎలిమినేట్ అయ్యారు. ప్రేక్షకుల నుంచి వస్తున్నా ఓట్లు జడ్జ్ ల స్కోర్ ఆధారంగా ఈ ఎలిమినేషన్స్ జరుగుతున్నాయి.