English | Telugu

ఎవరి మొగుడు వాళ్లకు మహేష్ బాబు...



ప్రపంచంలో ఉన్న ప్రతీ భార్య ఏమనుకుంటుంది అంటే తన భర్తను తాను తప్ప మిగతా అమ్మాయిలంతా అన్నయ్య అనో తమ్ముడు అనో అనుకోవాలని అనుకుంటుంది. అందుకే మన ఇళ్లల్లో చూస్తే సాధారణంగా మీ అన్నయ్య, మీ తమ్ముడు అంటూ వరసలు కలిపించేసి మిగతా లేడీస్ తో అలాగే మాట్లాడించేస్తారు. ఇప్పుడు ఆట సందీప్ భార్య జ్యోతి కూడా అదే కాన్సెప్ట్ తో ఇప్పుడు ఒక వీడియోని పోస్ట్ చేసింది. "హలో అందమైన అమ్మాయిలూ...రాఖీ పండగ సందర్భంగా ప్రపంచంలో ఉన్న అందమైన అమ్మాయిలంతా మా ఇంటికి వచ్చి సందీప్ గారికి రాఖీ కట్టొచ్చు. కింద మా ఇంటి అడ్రెస్స్ ఇచ్చాను..కాబట్టి వచ్చి రాఖీ కట్టేయండి " అని చెప్పేసరికి సందీప్ కాసేపు జ్యోతితో పరాచికాలు ఆడి దణ్ణం పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

ఐతే ఒక నెటిజన్ ఐతే "మీ ఆయన అందగాడు అని ఫీల్ అవుతున్నాడు..అంత సీన్ లేదని చెప్పు " అని కామెంట్ పెట్టారు. దానికి రిప్లైగా "ఎవరి హజ్బెండ్ వాళ్లకు మహేష్ బాబే నువ్వు..ముయ్" అని చెప్పారు. ఇక మరో లేడీ నెటిజన్ కొంటెగా కామెంట్ చేసింది "ప్రపంచంలో ఉన్న ప్రతీ ఒక్క అందమైన అమ్మాయికి సందీప్ గారు బావగారు అవుతారు జ్యోతక్క" అని చెప్పింది. బిగ్ బాస్ సీజన్ 7 నుంచి ఎలిమినేట్ అయిన సందీప్ పేరిట చాలా రికార్డులే ఉన్నాయి. తెలుగు బిగ్ బాస్ హిస్టరీలో 8 వారాల పాటు నామినేషన్స్‌లోకి రాకుండా ఉన్న తొలి కంటెస్టెంట్ . అంతేకాదు తొలి హౌస్ మేట్‌గా ఐదు వారాలు ఇమ్యూనిటీ పొందుకున్న కంటెస్టెంట్ . ‘నీతోనే డాన్స్’ విజేతగా నిలిచాడు సందీప్ మాష్టర్.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.