English | Telugu

Karthika Deepam2 : పారిజాతంకి బుద్ధి చెప్పిన జ్యోత్స్న...

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(karthika Deepam2). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -127 లో.. దీపకి కార్తీక్ ఫోన్ చేసి శౌర్య ఆరోగ్యం గురించి అడుగుతాడు. ఆ తర్వాత కోర్టులో జరిగిన దాని గురించి మీ నాన్న ఏమైనా అన్నారా అని దీప అడుగగా.. అదేం లేదు.. కానీ జ్యోత్స్న ఏదైనా గొడవ చేసిందా అని కార్తీక్ అంటాడు‌. అలా అడగ్గానే దీప పలకకుండా ఉండిపోతుంది. తర్వాత ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తుంటారు. మరోవైపు దాసు గురించి పారిజాతం ఆలోచిస్తుంది. జ్యోత్స్నకు ఎలాగైనా బుద్ధి చెప్పి, ఎలాగైనా దాస్ కి సారి చెప్పించాలని అనుకుంటుంది. అప్పుడే ఎదురుగా జ్యోత్స్న ఉంటుంది.

తాతకు నువ్వు రెండో భార్య అని తెలుసు.. మరి దాసు ఎక్కడ నుంచి వచ్చాడని జ్యోత్స్న అడుగగా.. ఇది మీ తాతయ్యకే కాదు నాకు రెండో పెళ్లి. మీ తాతయ్యను పెళ్లి చేసుకోవడానికి ముందే నాకు దాసు కొడుకు. మీ నాన్న చెప్పాడు కదా బాబాయ్ అవుతాడని ఇంకోసారి కనిపిస్తే అలాగే పిలువమని పారిజాతం అంటుంది. నువ్వే చెప్పావ్ కదా మనిషిని బట్టి విలువ ఇవ్వాలని. రెస్టారెంట్ లో నేను కొట్టింది నీ కొడుకునే అని నీకు తెలుసు నాకు అక్కడే ఎందుకు చెప్పలేదు. అయిన కుటుంబమే దూరం పెట్టిన ఆ వ్యక్తి గురించి తెలుసుకోవాల్సిన అవసరం తనకు లేదంటుంది జ్యోత్స్న . నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు. వాడు వీడు అంటావేంటని పారిజాతం అనగా.. నేను ఇలా మాట్లాడటానికి కారణం నువ్వే. అలాంటి వాళ్ళకు విలువ ఇవ్వకూడదని చెప్పింది నువ్వే. ఇప్పుడు నువ్వే ఇవ్వమని అంటున్నావని జ్యోత్స్న కోపంగా అంటుంది. మరోవైపు దీపతో దశరథ, సుమిత్ర మాట్లాడతారు.

మా ఇంటికి వచ్చినప్పటి నుంచి కష్టాలు అనుభవిస్తూనే ఉన్నావు. ఇప్పుడు నీ జీవితం, నీ కూతురు జీవితం నీ చేతుల్లోనే ఉందని దీపతో సుమిత్ర అంటుంది. ఇప్పుడు నీకేం సాయం కావాలో చెప్పు దీప చేస్తాం. నువ్వు సొంతంగా వ్యాపారం పెట్టుకుంటానంటే చెప్పు సాయం చేస్తాం. లేదంటే మా రెస్టారెంట్ లో పని చేస్తావా? నువ్వు ఏం చేయాలని అనుకుంటున్నావని దీపని దశరథ్ అడుగుతాడు.. మీ అమ్మానాన్న అడిగితే ఇలాగే ఆలోచిస్తావా దీప అని సుమిత్ర అడుగుతుంది. అప్పుడే జ్యోత్స్న వస్తుంది. దీపతో వెటకారంగా మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.