English | Telugu
ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న తేజస్విని గౌడ...
Updated : Aug 21, 2024
బిగ్ బాస్ న్యూ సీజన్ నెక్స్ట్ మంత్ నుంచి టెలికాస్ట్ కాబోతోంది అంటూ వార్తలు వస్తున్నాయి. అలాగే కంటెస్టెంట్స్ ని కూడా బిగ్ బాస్ టీమ్ కలుస్తోంది అని కూడా అంటున్నారు. ఐతే ఇప్పుడు బిగ్ బాస్ లోకి తేజస్విని గౌడ వెళ్తుంది అనే టాక్ కొద్ది రోజుల నుంచి వినిపిస్తోంది. ఐతే బిగ్ బాస్ హౌస్ లోకి తేజు పేరు ఇంకా కంఫర్మ్ కాలేదు అనే విషయం బిగ్ బాస్ లేటెస్ట్ అప్ డేట్స్ ఇన్స్టా పేజీలో రీసెంట్ గా పోస్ట్ ఐతే పెట్టారు. ఎందుకంటే తేజస్విని గౌడ బిగ్ బాస్ వాళ్ళు చెప్పిన అమౌంట్ కంటే ఇంకా కొంచెం ఎక్కువగా అడిగిందని సో ప్రస్తుతానికి అమౌంట్ విషయంలో చర్చలు జరుగుతున్నాయి..
ఒకవేళ బిగ్ బాస్ టీమ్ ఆమె అడిగిన రెమ్యూనరేషన్ కి ఓకే అంటే ఆమె బిగ్ బాస్ లోకి వస్తుంది లేదంటే ఆమె ఈ బిగ్ బాస్ ఆఫర్ ని రిజెక్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఆమె పేరు ప్రస్తుతానికి ఇంకా కంఫర్మ్ కాలేదని తెలుస్తోంది. ఐతే ప్రస్తుతానికి సింగర్ సాకేత్, జబర్దస్త్ మాజీ యాంకర్ సౌమ్య రావు, నటి యాష్మి గౌడా, నటుడు ఇంద్రనీల్, ఇంకా నటి సన కంఫర్మ్ ఐనట్టుగా వార్తలు వస్తున్నాయి. ఐతే మరి కామన్ మ్యాన్ క్యాటిగరీలో ఎవరిని తీసుకుంటున్నారనే విషయం ప్రస్తుతానికి ఎలాంటి విషయమూ తెలీదు. ఐతే కొంతమంది ఈ సీజన్ తీసుకోరు అని ఎందుకంటే లాస్ట్ సీజన్ లో పల్లవి ప్రశాంత్ కారణం అంటూ చెప్తున్నారు. ఇంకొంతమంది కామన్ మాన్ ని ఎవరో ఒకరిని లాస్ట్ మినిట్ లో తీసుకొస్తారు అని కూడా అంటున్నారు. చూడాలి.