English | Telugu
ఈటీవీ అంటే సుమ...సుమ అంటే ఈటీవీ
Updated : Aug 20, 2024
ఈటీవీ బలగం ప్రోమో పార్ట్ 2 భలే ఫన్నీగా ఉంది. ఇక ఈ షోలో బుల్లితెర నటులు ఈటీవీలో పని చేసిన వారంతా వచ్చారు. అలాగే జ్యోతిష్యం చెప్పే పంతుళ్లు కూడా వచ్చి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసారు. సుడిగాలి సుధీర్, సోనియా సింగ్ ఈ షోకి యాంకర్స్ గా ఉన్నారు. ఈ ఎపిసోడ్ కి ఇంద్రజ ఎంట్రీ ఇచ్చేసరికి సుధీర్ వెళ్లి ఆప్యాయంగా అమ్మా అని పిలిచాడు. దానికి ఆది కౌంటర్ వేసాడు. "ప్రతీ సోమవారం నుంచి ప్రతీ శుక్రవారం వరకు రాత్రి 7 గంటలకు అమ్మ ప్రేమ కొడుకు కోమా" కొత్త సీరియల్ స్టార్ట్ కాబోతోంది అని చెప్పాడు. ఇక ఆ డైలాగ్ కి ఇంద్రజ, భావన పడీపడీ నవ్వేశారు. ఈ షోకి స్పెషల్ గెస్ట్ గా నేచురల్ స్టార్ట్ నాని వచ్చాడు.
సుధీర్ మీద సినిమా కమెడియన్ పెద్ద కౌంటర్ వేసాడు.. "అవార్డులు వచ్చేసరికి నీకు ఇళ్ళు మార్చడం ఎక్కువైపోయింది" అంటూ యాంకర్ సోనియా సింగ్ ని టార్గెట్ చేస్తూ సుధీర్ కి పంచ్ ఇచ్చాడు. ఆ మాటకు సుధీర్ షాక్ అయ్యాడు. ఈ ప్రోమోకి నెటిజన్స్ ఫుల్ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ షోలో సుమ కనిపించలేదు. ఈటీవీ అంటే సుమ. సుమ అంటే ఈటీవీ అన్న విషయం తెలిసిందే. దాంతో నెటిజన్స్ ఫీలవుతున్నారు." ఈటీవీకి బలమే సుదీర్ గారు. అసలు ఇలాంటి ఈవెంట్స్ కి యాంకర్ గా సుమ గారు అయితేనే బాగుంటుంది.. సుమ గారు అయితేనే యండిల్ చెయ్యగలరు.. ఈటీవీ సంస్థ గురించి చెప్పాలి అన్నా, రామోజీరావు గారి గురించి చెప్పాలి అన్న సుమ గారు అయితేనే కరెక్టుగా చెయ్యగలరు " అంటూ కామెంట్స్ చేస్తున్నారు.