English | Telugu
Brahmamudi : అప్పు మొదటి వంట.. కళ్యాణ్ ఏం చెప్పనున్నాడు!
Updated : Aug 20, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -492 లో.. కళ్యాణ్ తను గతంలో రాసిన పుస్తకం దొరకడంతో దాన్ని తీసుకుని ఆ పుస్తకం పబ్లిష్ చేసిన పబ్లీషర్ దగ్గరకు వెళ్లడంతో అతడు గతంలో నీకు ఇవ్వాల్సిన డబ్బులు అంటు ఆరు వేలు చేతిలో పెటతాడు. కవితలు ఆపి, కథలు రాయమని చెప్తాడు. మరోవైపు అప్పూ చక్కగా జీన్స్ మీద కాస్త పొడవాటి టాప్ వేసుకునివేసుకునిమెడలోమెడలో పసుపు తాడు పైకి వేసుకుని చేతిలో గరిటె పట్టుకుని వంట చేస్తుంది. వంట అంటే మంట పెట్టుడే అనుకున్నా.. ఇందులో ఇన్ని వేయాల్నా.. ఇందులో సగం ఐటమ్స్ లేనే లేవు.. కూర ఎట్లుంటదో ఏంటో.. కవిగాడు ఎట్లా తింటాడో ఏమోనని అప్పు తనలో తానే మాట్లాడుకుంటూ.. వీడేంది ఇంకా రాలేదనినుకుంటుంది అప్పు ఇంతలో కళ్యాణ్ వచ్చి. అప్పూ. అని పిలుస్తాడు.
కవి వస్తున్నానంటూ వంట పూర్తికావడంతో, స్టవ్ ఆఫ్ చేసి కళ్యాణ్ ముందుకు వస్తుంది. లేట్ అయ్యింది ఏందిరా భయ్.. నాకు ఇక్కడ టెన్షన్ అయితోందని అప్పు అంటుంది. ఎందుకు అప్పు టెన్షన్ అని కళ్యాణ్ అంటాడు. హా.. నన్ను ఎత్తుకునిపోయినట్లు నిన్ను కూడా ఆ అనామిక ఎత్తుకుని పోతుందని అప్పు అనగానే.. కవి కూడా నవ్వుతాడు. సరే కాళ్లు చేతులు కడుక్కునిరా.. నేను అన్నం పెడతానంటుంది అప్పు. కళ్యాణ్ అలా వెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు.. అచ్చం అమ్మాయిలా.. వండిన వంటకాలన్నీ తెచ్చేస్తుంది. కళ్యాణ్ వచ్చి కూర్చుంటాడు. పక్కనే కూర్చున్న అప్పు.. తనకు, కవికి కంచంలో అన్నం పెడుతూ.. ఏమైనా జాబ్ దొరికిందా అని అడుగగా.. జాబ్ దొరకలేదు కానీజీతం దొరికింది. 6 వేలు అంటూ జేబులోంచి తీసి చూపిస్తాడు. జీతం ఏందని అప్పు అనగానే.. అదే అప్పు.. అప్పట్లో మా వదిన నాకు తెలియకుండా నా కవితలు బుక్ వేయించింది కదా.. ఆ బుక్ తాలూకా పబ్లీషర్స్‌ని కలిస్తే.. అప్పటి నుంచి ఇవ్వాలనుకుంటున్న రాయల్టీని ఇప్పుడు అందించారని కళ్యాణ్ అంటాడు. దాంతో అప్పు చాలా సంతోషిస్తుంది. అబ్బా కరెక్ట్ టైమ్‌కి ఇచ్చిండ్రా భయ్.. మరి కవితలు రాయడం గురించి అదీ అడగలేదా అని అప్పు అనగానే.. కవితలకు ఇప్పుడు అంత డిమాండ్ లేదట.. నన్ను కథలు రాయమన్నారంటూ కళ్యాణ్ జరిగింది చెబుతాడు.
మరి రాస్తావా? అయినా మీ ఇంట్లో రోజుకో బాగోతం జరుగుతుంది కదా.. అవే రాసెయ్ అని అప్పు అనగానే.. వెంటనే కవి కోపంగా వేలు చూపిస్తూ.. హేయ్ అని కోపంగా అంటాడు. దాంతో అప్పు నవ్వేస్తుంది.నిజంగానే ట్రై చెయ్‌రా.. నువ్వు తలుచుకుంటే ఏమైనా చేస్తావ్ అని అంటూనే.. సరేలే తిను.. మంచిగా లేకపోతే తిట్టుకోకని కూర వేస్తుంది. మనకు ఇదైనా దొరికింది.. మా ఇంట్లో అన్నం ప్లేట్ ముందు పెట్టుకుని తినకుండా చాలాసార్లు లేచి వెళ్లిపోయాను.. అన్నం విలువ.. ఆకలి విలువ అప్పుడు తెలియలేదు.. ఇప్పుడు తెలుస్తోందని కళ్యాణ్ అంటాడు. అప్పు కూడా కళ్యాణ్ వైపు జాలిగా చూస్తుంది. ఇక అన్నం కలిపి తిన్న కళ్యాణ్ ఆ రుచిని చూసి ఆగిపోతాడు. తాను చేసిన వంట ఎలా ఉందా? అన్నట్లుగా కళ్యాణ్ వైపు కన్ను ఆర్పకుండా చూస్తుంది అప్పు. ఇంతకీ ఆ కర్రీ ఎలా ఉంది? కళ్యాణ్ ఏం అన్నాడో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.