English | Telugu

Karthika Deepam2 : మీ పెళ్ళి చేసే వెళ్తాను.. కార్తీక్ ఆ విషయం చెప్పగలడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -128 లో.... దీప దగ్గరకి జ్యోత్స్న వచ్చి తను బాధపడేలా మాట్లాడుతుంటుంది. ముందు ఇక్కడనుండి వెళ్ళిపోమంటూ సుమిత్ర కోప్పడుతుంది. చూడు జ్యోత్స్న నా వల్ల మీ పెళ్లి ఆగిపోతుందని భయపడుతున్నావేమో కానీ అలా జరగదు.. మీ పెళ్లి చూడడానికి వచ్చాను.. చూశాకే వెళ్తాను. నీ పెళ్లి చెయ్యడం మీ అమ్మ నాన్న బాధ్యతే కాదు నాది కూడా అని జ్యోత్స్నకి దీప చెప్పి వెళ్లిపోతుంది.

అ తర్వాత సుమిత్ర కోపంగా వెళ్ళిపోతుంది. నువ్వు ఏం చేసిన నన్ను అంటున్నారే మనవరాలా అని పారిజాతం జ్యోత్స్నతో పారిజాతం అంటుంది. మరొకవైపు స్వప్న లవర్ తో కలిసి బయటకు వస్తుంది. ఇంట్లో మన మ్యాటర్ చెప్పావా అని అతను స్వప్నని అడుగుతాడు. లేదు రేపు ఇంటర్వ్యూకి వెళ్తున్నావ్ కదా జాబ్ వచ్చాక చెప్తాను.. మా అన్నయ్య ఉన్నాడు తానే ఒప్పిస్తాడని స్వప్న అనగానే.. ఏంటి నీకు అన్నయ్య కూడ ఉన్నాడా అని అతను అడుగుతాడు. అంటే సొంత అన్నయ్య కాదు నేను అలా అన్నయ్య అనుకుంటున్నా బాస్ అని కూడ పిలుస్తాను.. పేరు కార్తీక్.. నీకు జాబ్ వచ్చాక అమ్మ, నాన్నలకి అతన్ని పిలిచి విషయం చెప్తానని స్వప్న అంటుంది.అ తర్వాత కార్తీక్ బయటకు వెళ్తుంటే ఎక్కడికి అని కాంచన అడుగుతుంది. శౌర్యని ఈ రోజు చెకప్ కి తీసుకొని వెళ్ళాలి అని కార్తీక్ అనగానే శ్రీధర్ కోప్పడతాడు. వాళ్ళ అమ్మ ఉంది కదా తను తీసుకొని వెళ్తుందని అంటాడు. ఈ ఒక్క సారి నేను తీసుకొని వెళ్తానని కార్తీక్ అంటాడు. అయిన శ్రీధర్ అర్థం చేసుకోకుండా కాంచనకి ఆలా చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడంటూ కోప్పడతాడు.

మరొకవైపు మనమే ఎప్పుడు ఆ దీప గురించి ఓవర్ గా ఆలోచిస్తున్నావేమోనని తను నా పెళ్లి చేసాక వెళ్తాను అంటుంది.. మనమే తనని తప్పుగా అపార్థం తీసుకున్నామని పారిజాతంతో జ్యోత్స్న అనగానే.. అప్పుడే దీప దగ్గరికి కార్తీక్ రావడం చూసిన పారిజాతం.. జ్యోత్స్నకి చూపిస్తుంది. దాంతో జ్యోత్స్న కోపంగా ఉంటుంది. మరొకవైపు శౌర్యని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తాను అంటాడు. మీ వాళ్ళ ఇప్పుడు మేం చాలా హ్యాపీగా ఉన్నాము.. మీరు కూడా మీ పెళ్లి గురించి ఆలోచించండి అని కార్తీక్ కి దీప చెప్తుంది. ఆ తర్వాత కార్తీక్ అందరికి ఒక విషయం చెప్తానంటూ పిలుస్తాడు. సుమిత్ర వాళ్ళు అందరు వస్తారు. ఏం చెప్తాడో ఏంటో అని దీప, జ్యోత్స్న లు టెన్షన్ పడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.