English | Telugu
రౌడీ రోహిణి ప్రెగ్నెంట్ ... బాబును కూడా కన్నది.
Updated : Aug 21, 2024
బుల్లితెర మీద లేడీ కమెడియన్స్ లో రౌడీ రోహిణి ఫుల్ ఫేమస్. అసలు రోహిణి షో స్టేజి మీదకు వచ్చిందంటే చాలు ఆడియన్స్ పడీ పడీ నవ్వాల్సిందే. ఇక ఇప్పుడు రోహిణి గర్భిణీ ఐన న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇంతకు రోహిణి గర్భిణీ అయ్యిందా చూద్దాం. రాబోయే జబర్దస్త్ ప్రోమోలో రోహిణి గర్భిణీగా నటించింది. అందులో కమెడియన్ సన్నీ భర్తగా నటించాడు. ఐతే 9 నెలలతో గర్భంతో రోహిణి నొప్పులు పడుతుంటే పక్కనే సన్నీ కూడా పడుతూ ఉన్నాడు. "నాకంటే నొప్పులు మొదలయ్యాయి. నీకేమయ్యింది.
నొప్పులు పడుతున్నావ్ " అని అడిగింది రోహిణి. "నీకు నెలలు నిండాయి . నాకు సంవత్సరాలే నిండాయి కదే" అన్నాడు కామెడీగా సన్నీ. ఈ గ్యాప్ లో రోహిణికి బాబు కూడా పుట్టేస్తుంది. ఇంతలో పక్కింట్లోంచి ఆటో రాంప్రసాద్ తన బిడ్డను తీసుకుని వచ్చాడు. "ఇంతకు మీ బాబుకు ఎం పెట్టారు" అని రోహిణిని అడిగాడు. "రాజు" అని పెట్టాను అని చెప్పేసరికి "అదేం పేరండి చూడండి మా పాపకు ఎం పేరు పెట్టానో గుడుగుడు గుంజం" అన్నాడు ఆ పేరుకు షాక్ అయ్యింది రోహిణి. "నా మాట విని అప్పడప్పడ తాండ్ర"| అని పెట్టండి అని రాంప్రసాద్ సలహా ఇచ్చాడు. రోహిణి కూడా అదేదో గొప్ప పేరన్నట్టు నామకరణం చేసి పిలవడం స్టార్ట్ చేసింది. అలా ఈ జబర్దస్త్ ఎపిసోడ్ రోహిణి గర్భిణీ అయ్యింది బాబును కూడా కన్నది.