English | Telugu
Guppedantha Manasu : నిజం చెప్పేసిన వసుధార.. అంతా వినేసిన మహేంద్ర!
Updated : Aug 20, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(Guppedantha Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1157 లో.....రిషి దగ్గరికి వసుధార స్వీట్ తీసుకొని వస్తుంది. ఏం ఆలోచిస్తున్నారని వసుధార అడుగుతుంది. అన్నయ్య ముందే వస్తానని చెప్పి లాస్ట్ మినిట్ వరకు రాలేదని రిషి అంటాడు. నువ్వు ఏదైనా ప్లాన్ చేసావా అని రిషి అడుగుతాడు. అదేం లేదు సర్ అసలు ప్రొద్దున నుండి ఇప్పటివరకు మీతోనే ఉన్నాను నేనెలా చేస్తాను అని వసుధార అంటుంది. రసగుల్లా తినండి అని వసుధార అనగానే.. ఇప్పుడు స్వీట్ ఏంటని రిషి అడుగుతాడు. మీరు ఎండీ అయ్యారు కదా అందుకే మావయ్య స్వీట్ చెయ్యమని చెప్పారని వసుధార అంటుంది.
అ తర్వాత ఇద్దరు ఒకరికొకరు స్వీట్ తినిపించుకుంటారు. వసుధార వంక రిషి రొమాంటిక్ గా చూస్తుంటాడు. మరొకవైపు మను మహేంద్రతో గతంలో మాట్లాడిన మాటలు గుర్తుచేసుకుంటాడు. కోపంగా గన్ తీసి మహేంద్ర ఫోటో వైపు చూస్తుంటాడు. అ తర్వాత ఫోటో పడేసి ఇన్ని రోజులు నాన్న అంటే చాలా కోపం పెంచుకున్నాను.. అలాంటింది ఇప్పుడేం చెయ్యలేకపోతున్నానని అనుకుంటాడు. ఆ తర్వాత దేవయాని, శైలేంద్రలు మాట్లాడుకుంటారు. ఇప్పుడు మను కన్న తండ్రి మహేంద్ర అని తెలిసింది కదా.. ఇక మనుని రెచ్చగొట్టే ప్రయత్నం చెయ్యాలి. అప్పుడు ఇంకా కోపం పెంచుకుంటాడు. ఆ తర్వాత నువ్వు ఎండీ అవ్వొచ్చని దేవయాని అంటుంది. అసలు శైలేంద్ర ఎందుకు లేట్ వచ్చారు. ఏమై ఉంటుందని ధరణికి వసుధార ఫోన్ చేసి అడుగుతుంది. అత్తయ్యని కాలేజీకీ రావొద్దని మావయ్య చెప్పారు. కానీ ఏదో టెన్షన్ గా ఫోన్ మాట్లాడుతు ఏదో ఫోటో తీసి ఎవరికో పంపింది.. ఇదంతా మను వల్లే అని మా ఆయన అంటుంటే అత్తయ్య ఆపారని వసుధారకి ధరణి చెప్తుంది. అ తర్వాత ఏం జరిగి ఉంటుంది. మను తన తండ్రి మావయ్య అని తెలుసుకున్నాడా అని వసుధార ఆలోచిస్తుంది.
మరుసటిరోజు వసుధార ఆలోచిస్తుంది. అప్పుడే రిషి వస్తాడు. ఏమైందని అడుగుతుంది. మనం ఒకసారి అనుపమ గారిని కలిస్తే.. నా ఆలోచన బయలు మీకు తెలుస్తాయని వసుధార అనగానే.. సరే వెళ్లి ఇప్పుడే కలుద్దామని రిషి అంటాడు. వాళ్లు వెళ్తుంటే ఎక్కడికి అంటు మహేంద్ర అడుగగా.. అనుపమ గారి దగ్గరకి అని చెప్తారు. అయితే నేను వస్తానని మహేంద్ర అనగానే వద్దని వసుధార అంటుంది. అ తర్వాత వసుధార, రిషిలు అనుపమ దగ్గరికి వెళ్తారు. తరువాయి భాగంలో.. మను తండ్రి మావయ్యనే అని రిషితో వసుధార చెప్తుంది. దాంతో రిషి షాక్ అవుతాడు. అ మాటలు మహేంద్ర విని షాక్ అవుతాడు. అ తర్వాత మనుని శైలేంద్ర కలిసి.. నీ తండ్రి మా బాబాయ్ అని తెలిసింది కదా.. ఇప్పుడేం చెయ్యబోతున్నావని శైలేంద్ర అడుగుతాడు. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.