మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి... హైకోర్టుపైనే ఆర్టీసీ కార్మికుల ఆశలు
దాదాపు నెలన్నరగా సమ్మె చేస్తున్నా, ప్రభుత్వం దిగిరాకపోవడంతో, పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడితోపాటు నిరవధిక దీక్షలకు సిద్ధమవుతోంది. జేఏసీ నేతలు అశ్వద్ధామరెడ్డి, రాజిరెడ్డి, లింగమూర్తి, సుధలు దీక్షలో కూర్చోనున్నారు.