English | Telugu
సినిమా ఫైటింగ్‌ను తలదన్నే రేంజ్‌లో కొట్టుకున్న శ్రీకాకుళం స్టూడెంట్స్
Updated : Feb 29, 2020
సినిమా ఫైటింగ్‌ను తలదన్నే రేంజ్‌లో కొందరు విద్యార్థులు తన్నుకున్న ఘటన శ్రీకాకుళంలో చోటు చేసుకుంది. పాలకొండ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో.. ఓ జూనియర్ విద్యార్థిని సీనియర్ విద్యార్థి బైక్‌తో ఢీ కొట్టడంతో ఈ గొడవ ప్రారంభమైంది. విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి, నడిరోడ్డుపై దారుణంగా కొట్టుకున్నారు. ఈ ఫైటింగ్ వల్ల గంట సేపు ట్రాఫిక్ జామ్ అయింది. మెయిన్‌రోడ్డ మీద విద్యార్థులు సృష్టించిన బీభత్సానికి స్థానికులు భయపడిపోయారు. వీధి రౌడీల్లా వారు ఫైట్ చేసిన తీరు పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు స్మార్ట్‌ఫోన్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడంతో పోలీసుల దృష్టికి వెళ్లింది. పాలకొండ పోలీసులు దీనిపై దర్యాప్తు జరుపుతున్నారు.