English | Telugu

2020-21 కి గాను 3,309 కోట్ల బడ్జెట్ కు టిటిడి పాలకమండలి ఆమోదం!

టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన టిటిడి పాలకమండలి సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా శార్వరినామ సంవత్సర టిటిడి నూతన పంచాంగాన్ని వైవి సుబ్బారెడ్డి ఆవిష్కరించారు. అదేవిధంగా ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2020-21 సంవత్సరానికి గాను 3,309 కోట్ల రూపాయల బడ్జెట్ కు టిటిడి పాలకమండలి ఆమోదం తెలిపింది. గత ఏడాది కంటే 66 కోట్ల మేర టిటిడి బడ్జెట్ పెరిగింది.

టిటిడి పాలకమండలి కీలక నిర్ణయాలు:

  • భూందిపోటులో అగ్నిప్రమాదాల నివారణకు 3.30 కోట్లు కేటాయింపు....
  • తిరుపతిలోని జూపార్క్ దగ్గర 14 కోట్లతో ప్రతిభావంతుల శిక్షణా సంస్థ వసతి గృహం నిర్మాణానికి ఆమోదం.....
  • 34 కోట్లు ఎస్.వి బధిరపాఠశాల హాస్టల్ నిర్మాణానికి నిర్ణయం..
  • బర్డ్ ఆసుపత్రిలో అభివృద్ది పనులకు 8.5 కోట్లు కేటాయింపు....
  • చెన్నైలో పద్మావతి ఆలయం నిర్మాణానికి 3.9 కోట్లు కేటాయింపు....
  • హైదరాబాదు జూబ్లీహిల్స్ లోని టిటిడి టెంపుల్ దగ్గర పుష్కరిణి, కళ్యాణమంటపం, వాహనమంటపం నిర్మాణానికి ఆమోదం...
  • షోషియల్ మీడియాలో టిటిడి పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని అరికట్టేటందుకు ఇన్ఫోసిస్ సహకారంతో సైబర్ క్రైమ్ విబాగం ఏర్పాటుకు నిర్ణయం....
  • అలిపిరి దగ్గర వాహనాల ఎంట్రీ టోల్ ఫీ పెంపుదలకు నిర్ణయం, టూవిలర్ కు టోల్ ఫీ మినహాయింపు...కార్లు,జీపులు లకు 50రూపాయలు, బస్సు, లారీలు 100 రూపాయలు, హెవీ వాహనాలకు 200 రూపాయల చొప్పున వసూలు చేయాలని నిర్ణయించిన టిటిడి.