English | Telugu
ఏపీలో కరోనా కేసులు, మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గడచిన 24 గంటల్లో 37,162 శాంపిల్స్ ని పరీక్షించగా.. 4,944 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది.
తూర్పుగోదావరి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్ లో దళిత యువకుడికి పోలీసులు శిరోముండనం చేసి, తీవ్రంగా కొట్టారు. జిల్లాలోని సీతానగరం పోలీస్ స్టేషన్ లో ఈ ఘోరం జరిగింది.
ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని చెబుతున్న సీఎం వైఎస్ జగన్ ఇంతవరకు మాస్క్ ధరించలేదని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఇప్పటివరకు మాస్క్ ధరించని సీఎం.. ఇతరులు మాస్కు ధరించకపోతే జరిమానా వేస్తా అనడం ఎంతవరకు సమంజసం అని చంద్రబాబు ప్రశ్నించారు.
కోవిద్ 19 వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే మాస్క్ తప్పనిసరిగా వేసుకోవాలి అది ఎన్-95 మాత్రమే అంటూ ప్రచారం చేశారు. ఇప్పుడు కవాటం ఉన్న ఆ మాస్క్ లు సురక్షితం కాదు అంటున్నారు కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన వైద్య సేవల డైరెక్టర్ జనరల్.
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం చేస్తోన్న అప్పులు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయని క్రెడిట్ రేటింగ్స్ సంస్థ తాజాగా విడుదల చేసిన లెక్కలు హెచ్చరిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రుణ-జీఎస్డీపీ నిష్పత్తి 34.6% కి చేరనున్నట్లు ఆ సంస్థ అంచనా వేసింది.
చైనా తో సరిహద్దు వివాదం సందర్భంలో బీజేపీ ప్రభుత్వం పై విరుచుకు పడ్డ కాంగ్రస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తాజాగా మరో సారి సెటైర్లతో దాడి చేసారు.
తెనాలి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రావి రవీంద్రనాథ్ చౌదరి మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను కలిసి రెండు లేఖలు అందజేశారు. ఒకటి వ్యక్తిగత భద్రత కోసం కాగా, రెండోది రాజధాని అమరావతి కోసం.
పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ ను ఏపీ ప్రభుత్వం సవరించింది. పెట్రోల్ పై రూ. 1.24, డీజిల్ పై 93 పైసలు వ్యాట్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ వ్యాట్ 2005ను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
విప్లవ కవి వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. 81 ఏళ్ల వరవరరావు అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. పైగా, ఇప్పుడు ఆయనకు కరోనా కూడా సోకడంతో.. ముంబైలోని జేజే ఆసుపత్రికి తరలించారు.
ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నింటినీ సంక్షోభంలో నెట్టేసింది కోవిద్ 19 వైరస్. దీన్ని చైనా తయారు చేసిందన్న కారణంగా చాలా బహుళజాతి సంస్థలు తమ కంపెనీలను చైనా నుంచి తొలగిస్తున్నాయి.
భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో గత 29 సంవత్సరాలుగా జైలు శిక్ష అనుభవిస్తున్న నళిని శ్రీహరన్.. మంగళవారం ఉదయం తమిళనాడులోని వెల్లూరు జైలులో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
ప్రపంచమంతా ఎదురుచూస్తున్న కోవిద్ 19 వైరస్ ను ఎదుర్కొనే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేస్తుంది. కోట్లాదిమందికి సోకి లక్షలాది మందిని బలితీసుకున్న ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు పలుదేశాల్లో 140పైగా పరిశోధనలు జరుగుతున్నాయి.
తిరుమల ఓఎస్డీ డాలర్ శేషాద్రి ఆరోగ్యంపై వదంతులు పుట్టిస్తున్న ఎస్వీ బద్రిపై పోలీసులకు టీటీడీ ఫిర్యాదు చేసింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే, ఈ ఎస్వీ బద్రి తిరుమల గౌరవ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులుకి ప్రధాన అనుచరుడు కావడం గమనార్హం.
కరోనాతో ప్రపంచం మొత్తం విలవిలలాడుతోంది. ఈ పరిస్థితుల్లో కరోనా ట్రీట్మెంట్ కు అత్యవసరమైన మందులను కొంత మంది బ్లాక్ మార్కెట్ చేసి సొమ్ము చేసుకుంటుండగా, మరి కొంత మంది ప్లాస్మా దాతలుగా అవతారం ఎత్తి కరోనా బాధితులను...