English | Telugu
ఎన్టీఆర్ విగ్రహం టచ్ చేయాలంటే వణుకు పుట్టాలి
Updated : Jul 21, 2020
ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాజధాని అమరావతి తరలిపోకుండా పోరాటాలను మరింత ఉధృతం చేయాలి అన్నారు. అన్ని రాష్ట్రాల కంటే ఏపీనే ఎక్కువ అప్పులు చేసిందని విమర్శించారు. చిత్తూరు జిల్లాలో న్యాయమూర్తిపై దాడి చేసింది మంత్రి అనుచరులే అని చంద్రబాబు ఆరోపించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ నేత, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర కావలిలో ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు వ్యవహారాన్ని చంద్రబాబు దృష్టికి తెచ్చారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, పోలీసులు కలిసి తొలగించారని బీదా రవిచంద్ర వివరించారు. కావాలనే ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించారని ఎమ్మెల్సీ చెప్పడంతో చంద్రబాబు ఆగ్రహానికి గురయ్యారు. ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు అంశాన్ని సీరియస్‍గా తీసుకోవాలని నెల్లూరు నాయకులకు చంద్రబాబు సూచించారు. ఇకపై ఎన్టీఆర్ విగ్రహాలను టచ్ చేయాలంటే.. వైసీపీ నాయకులకు వణుకు పుట్టేలా మన చర్యలు ఉండాలని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు ఆదేశించారు.