English | Telugu

కరోనా కాలంలో మోడీ సర్కార్ సాధించిన ఆరు ఘనకార్యాలు ఇవే: రాహుల్

చైనా తో సరిహద్దు వివాదం సందర్భంలో బీజేపీ ప్రభుత్వం పై విరుచుకు పడ్డ కాంగ్రస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తాజాగా మరో సారి సెటైర్లతో దాడి చేసారు. తాజాగా ట్విట్టర్ వేదికగా మోడీ ప్రభుత్వం పై తీవ్రంగా విరుచుకు పడ్డారు. ఒక పక్క దేశాన్ని క‌రోనా ప‌ట్టి పీడిస్తోంటే.. మోదీ ప్ర‌భుత్వం రాష్ట్ర‌ ప్ర‌భుత్వాలను కూల్చే ప‌నిలో ప‌డింద‌ని అయన మండిప‌డ్డారు. దీని పై ఫిబ్ర‌వ‌రి నుంచి నెల‌ల‌వారీగా మోదీ ప్ర‌భుత్వం చేసిన ప‌నుల గురించి ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు.

ఫిబ్ర‌వ‌రిలో - న‌మ‌స్తే ట్రంప్ ప్రోగ్రామ్,
మార్చిలో - మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కూల్చివేత‌,
ఏప్రిల్‌లో - కొవ్వొత్తులను వెలిగించడం ..
మే నెల‌లో - మోదీ స‌ర్కార్‌ ఆరేళ్ళ వార్షికోత్సవ సెలబ్రేషన్స్ ,
జూన్‌లో - బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల వ‌ర్చువ‌ల్ ర్యాలీ,
జులైలో - రాజ‌స్థాన్ స‌ర్కార్‌ను కూల్చేందుకు కుట్ర..

ఇవీ ఆరు నెల‌లుగా మోదీ ప్ర‌భుత్వం సాధించిన ఘనకార్యాలు అంటూ రాహుల్ తీవ్రంగా విమ‌ర్శించారు. దీంతో దేశ ప్రజలు కరోనాపై పోరాటం చేయడంలో (ఆత్మ‌నిర్భ‌రత్వంతో) తమపై తామే ఆధారపడ్డారు అంటూ సెటైర్ వేశారు.