English | Telugu
కోవిద్ 19 వైరస్ తో అతి ఎక్కువగా ప్రభావితమైన అగ్రదేశాలు వ్యాక్సిన్ డోసులు కొనుగోలు చేసే రేసులో పోటీలు పడుతున్నాయి. వ్యాక్సిన్ తయారి కోసం ప్రపంచంలోని అనేక దేశాల్లోని 150కి పైగా సంస్థలు ప్రయోగాలు చేస్తున్నాయి.
ప్రస్తుతం అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆగస్టు 5న ప్రధాని మోదీ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం జరగనుంది.
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వచ్చే శుక్రవారంలోగా అమలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ ను ఉద్దేశించి వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న కరోనా ప్రజల జీవితాలను అతలాకుతలం చేసింది. ప్రజల ప్రాణాలను హరిస్తోంది. ఈ వ్యాధి పై జరుగుతున్న ప్రచారంతో ఇదో భయంకరమైన రోగంగా భావిస్తూ కరోనా పాజిటివ్ అని తెలియగానే కొందరు భయంతోనే చనిపోతున్నారు.
ఎప్పుడు రద్దీగా ఉంటూ నమో వెంకటేశాయ అంటూ ప్రతిధ్వనించే ఏడు కొండలు కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ సమయంలో నిశబ్ధంగా మారాయి. లాక్ డౌన్ ఎత్తేసి ఆలయాల్లోకి భక్తులను అనుమతించిన తర్వాత...
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా నిమ్మగడ్డ రమేశ్ ను కొనసాగించాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు ఈ రోజు నిరాకరించింది.
రతనాల సీమగా పెరుగాంచిన రాయలసీమలో వర్షాకాలం వచ్చిందంటే చాలు వజ్రాల వేట మొదలౌతుంది. తొలకరి చినుకులు పడగానే పొలాల వెంట పిల్లా పెద్ద అంతా విలువైన రాళ్ల కోసం వెదుకులాట ప్రారంభిస్తారు.
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న తెలంగాణ మంత్రి కేటీఆర్ ను అటు రాజకీయ ప్రముఖులు, ఇటు సెలబ్రిటీలు బర్త్ డే విషెస్ తో ముంచెత్తుతున్నారు.
కరోనా నియంత్రణ పేరుతో బెంగళూరులో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కరోనా సోకిన వారుండే ప్రదేశాలను అధికారులు కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి జనసంచారాన్ని కట్టడి చేయడం చూస్తున్నాం.
అసోం రాజధాని గువాహటిలోని సెంట్రల్ జైలులో 435 మంది ఖైదీలు కరోనా బారినపడ్డారు. ఇది జైలులోని మొత్తం ఖైదీల సంఖ్యలో 44 శాతం కావడం గమనార్హం.
భారత్ లో కరోనా ఉధృతి కొనసాగుతూనే వుంది. ప్రతి రోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 49,310 మందికి కొత్తగా కరోనా పాజిటివ్ గా తేలింది.
కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని కుదిపేస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతూ ఇటు సామాన్యులకు అటు ప్రభుత్వాలకు చుక్కలు చూపిస్తోంది.
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత తగ్గడం లేదు. కామన్ మ్యాన్ నుండి వీఐపీల వరకు అందరిని చుట్టేస్తోంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం మొహమ్మద్ అలీ సహా పలువురు ఎమ్మెల్యేలు కూడా ఈ మహమ్మారి బారినపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర మంత్రి కె. తారకరామారావు పుట్టినరోజు సందర్భంగా బందూక్ సినిమా డైరెక్టర్ లక్ష్మణ్ వినూత్న బహుమతి సిద్ధం చేశారు. కెటీఆర్ జన్మదినమైన 24.07.76 రోజుతో కూడిన కరెన్షీ నోట్లని సేకరించి..
కరోనా బారిన పడిన ప్రజలకు సరైన వైద్యం అందించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంటుంది.