English | Telugu
అమెరికాలోని అలస్కా ద్వీపకల్పంలో తీవ్రవైన భూకంపం వచ్చింది. ఇది రిక్టర్ స్కేల్ పై 7.8గా నమోదైంది. దాంతో సునామీ హెచ్చరికలు చేశారు. దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
హిందువులు ఎంతో పవిత్రంగా భావించే అమర్ నాథ్ యాత్ర ఈ ఏడాదికి రద్దు అయ్యింది. ఈనెల 21 నుంచి యాత్ర ప్రారంభం అవుతుందని ముందుగా ప్రకటించినప్పటికీ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో యాత్రను రద్దు చేసినట్లు అమర్ నాథ్ దేవస్థానం బోర్టు స్పష్టం చేసింది.
కోవిద్ 19 వైరస్ వ్యాప్తి కారణంగా పెరుగుతున్న రోగుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం మరో రెండు దవాఖానాలను పూర్తి స్థాయి కరోనా చికిత్స కేంద్రాలుగా మార్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
లద్ధాఖ్ ఎల్ఎసీ వద్ద చొరబాట్లపై ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చలు ఇంకా ఒక కొలిక్కి రాకముందే డ్రాగన్ కంట్రీ భారత్ సరిహద్దుల వెంట సైన్యాన్ని మోహరిస్తూ కుతంత్రాలు పన్నుతోంది. ఇరుదేశాల మధ్య శాంతి నెలకొనేలా చూస్తామంటూనే డ్రాగన్ కంట్రీ మరోవైపు తన కుటిల బుద్ధిని చూపిస్తోంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించే కాళేశ్వరం విస్తరణ పనులపై దాఖలైన పిటిషన్ పై విచారణ ఆగస్టు 5కు వాయిదా పడింది. ఈ విషయంలో అవసరమైన పాలనాపరమైన ఆదేశాలు ఇవ్వాలని...
భారత- చైనా సరిహద్దుల్లో మరణించిన కల్నల్ సంతోష్ బాబు భార్య సంతోషికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం కేటాయించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్ లో సంతోషికి అందించారు.
కరోనా మహమ్మారి దెబ్బకు ఏపీ విలవిలలాడుతోంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 6,045 మందికి కరోనా సోకినట్లు ఏపీ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికం విశాఖ జిల్లా లోనే ఉన్నాయి.
ఈ రోజు ఉదయం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, నిమ్మగడ్డ రమేశ్ కుమార్ను ఎస్ఈసీగా కొనసాగించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. తాజాగా దీని పై అధికార పార్టీ వైసీపీ స్పందించింది.
కరోనా మహారాష్ట్రను మరీ ముఖ్యంగా ముంబయి ని కబళిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కరోనా మహమ్మారిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
కృష్ణా జిల్లా గన్నవరం వైసీపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో.. అధికారపార్టీలో ఏర్పడిన విభేదాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది.
యాదాద్రిలో చిన్నారుల అక్రమ నిర్భందం, నల్లగొండలో చిన్నారుల అమ్మకం ఇలా ఎక్కడ బాల్యం బజారున పడితే అక్కడ తన స్వరం వినిపిస్తూ న్యాయం జరిగేలా పోరాడే వ్యక్తి అచ్యుత రావు.
ప్రముఖ బిల్డర్స్ సంస్థ ఆదిత్య బిల్డర్స్ అధినేత వీరపరెడ్డి కోటారెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. గత కొన్నిరోజుల క్రితం వెలుగులోకి వచ్చిన 100కోట్ల డాక్యుమెంట్ల చోరీ కేసు కొత్త మలుపు తిరిగింది.
మనదేశం లో కరోనా ఉధృతి తీవ్రంగానే ఉంది. ప్రతి నిత్యం రికార్డ్ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కేంద్రం ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు సుమారు 12 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు గా తెలుస్తోంది.
ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పోలీసు శాఖను ఆదేశించారు.
ఏపీ అధికార పార్టీ వైసీపీ నేతలు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా, తాజాగా వైసీపీకి చెందిన మరో కీలక నేత కరోనా బారిన పడ్డారు.