English | Telugu
వ్యాక్సిన్ అతి త్వరలోనే...
Updated : Jul 21, 2020
తొలి వ్యాక్సిన్ సిద్దం చేసిన రష్యా
కోవిద్ 19 వైరస్ తో బాగా ప్రభావితమైన రష్యా వ్యాక్సిన్ తయారిలో చాలా చురుగ్గా పరిశోధనలు నిర్వహిస్తోంది. రష్యాప్రభుత్వం వ్యాక్సిన్ తయారీని ప్రతిష్టాత్మకంగా భావిస్తూ పరిశోధనలను వేగవంతం చేయడానికి కావల్సిన ఏర్పాట్లు చేసింది. 1,2 దశల క్లినికల్ ట్రయల్స్ గతంలోనే పూర్తి చేసిన సెచెనోవ్ విశ్వవిద్యాలయం ఇప్పుడు మూడోదశ క్లినికల్ ట్రయల్స్ ను కూడా విజయవంతంగా నిర్వహించింది. అన్ని పరీక్షలు మంచి ఫలితాలను ఇచ్చాయని.. ఆగస్టు 3 నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువస్తామని రష్యా ఆరోగ్యశాఖ మంత్రి ప్రకటించారు. మూడు కోట్ల డోస్ లను దేశీయంగా తయారు చేస్తామని మరో 17కోట్ల డోస్ లు విదేశాల్లో తయారు చేస్తమని ఆయన తెలిపారు. ఈ వ్యాక్సిన్ తమతమ దేశాల్లో తయారు చేయడానికి ఐదు దేశాలు ఇప్పటికే అంగీకరం తెలిపాయన్నారు.
త్వరలోనే ఫలితాలు..
కోవిద్ 19 వైరస్ ను ఎదుర్కోనే వ్యాక్సిన్ పై లండన్ లోని ఆక్సఫర్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రయోగాలు విజయవంతమయ్యాయి. వారు తయారు చేసిన ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ కోవిద్ 19 వైరస్ తో సమర్థవంతంగా పోరాడగలదని ప్రకటించారు. చాలా సురక్షితమైన తమ వ్యాక్సిన్ వైరస్ను తట్టుకునే వ్యాధి నిరోధక శక్తి ని ఇస్తుందన్నారు. తమ పరిశోథనల ఫలితాలను ది లాస్సెట్ మెడికల్ జర్నర్ లో ప్రచురించారు. మొదటి దశ, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి అయ్యాయని, చివరి దశగా వృద్దులపై వ్యాక్సిన్ ప్రయోగాలు జరుగుతున్నయన్నారు. ఈ ఏడాది చివరి వరకు పూర్తి ఫలితాలు వస్తాయన్నారు.
తొలిదశ ప్రారంభం
భారత్ లో కోవిద్ 19 వైరస్ ను అరికట్టే వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమైనవి. కాస్త ఆలస్యంగా క్లినికల్ ట్రయల్స్ మొదలైనా.. విజయవంతంగా కొనసాగుతున్నాయి. దేశంలోని భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ ఫస్ట్ డోస్ 12 చోట్ల 60మంది వాలంటీర్లపై తొలిదశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని నిమ్స్ లో ఇద్దరు వాలంటీర్లకు ఈ వ్యాక్సిన్ ఇచ్చారు. 14రోజుల తర్వాత ఫలితాలు వస్తాయి.