English | Telugu
భారత వైమానిక దళం శక్తిని పెంచే రాఫెల్ యుద్ధ విమానాలు భారత్ ను చేరాయి. ఏడువేల కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణాన్ని రెండురోజుల్లో పూర్తి చేసి విజయవంతంగా ల్యాండింగ్ అయిన ఈ యుద్ధ విమానాలను నడిపిన పైలట్ల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.
ఉన్నత విద్యావిధానంలో కీలక సంస్కరణలు చేస్తూ కేంద్ర క్యాబినేట్ కొత్త విద్యావిధానం -2020 ఆమోదం తెలిపింది. అంతేకాదు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ను ఇక నుంచి కేంద్ర విద్యాశాఖగా పరిగణిస్తారు.
కేంద్ర ప్రభుత్వం నిన్న కొత్త విద్యావిధానం ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు 34 సంవత్సరాల తర్వాత మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం కొత్త విద్యావిధానాన్ని తీసుకొచ్చింది.
మహబూబ్నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తమ పొలాల నుంచి ఇసుక లారీలను తీసుకెళ్లొద్దు.. పొలాలు ఆగమై పోతున్నాయని ఇసుక లారీని అడ్డుకున్న రైతును అదే లారీతో తొక్కించి దారుణంగా హతమార్చారు.
ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష దాటి పోయిన సంగతి తెలిసిందే. కొన్ని జిల్లాలలో ప్రతి రోజు ఏకంగా వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో తాజాగా కృష్లా జిల్లా కేంద్రం అయిన మచిలీపట్నం, దాని పరిసర ప్రాంతాల్లో లాక్డౌన్ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఏపీలో కరోనా ప్రళయ తాండవం చేస్తోంది. ఎన్నడు లేని విధంగా ఈ రోజు ఏకంగా 10 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 70,584 శాంపిల్స్ ను పరీక్షించగా.. 10,093 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది.
తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అనుచరుడు చలివేంద్ర సురేష్ యథేచ్ఛగా పేకాట క్లబ్ ను నిర్వహించిన వైనం వెలుగులోకి వచ్చింది. ఓ అపార్ట్మెంట్ లో నివాసం కోసం అద్దెకు తీసుకున్న ఆయన పేకాట క్లబ్ ను నిర్వహిస్తున్నాడని తెలిసింది.
స్వల్ప నుంచి సాధారణ స్థాయి వరకు కరోనా లక్షణాలు గల రోగుల చికిత్స కోసం హెటిరో సంస్థ 'ఫెవిపిరమిర్' మందును బుధవారం లాంచ్ చేసింది. అయితే ఈ టాబ్లెట్ పేరును 'ఫెవివిర్' గా మార్చామని, ఒక్కో టాబ్లెట్ ధర 59 రూపాయలని ప్రకటించింది.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అమ్ములపొదిలోకి ప్రపంచంలోనే అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాలు కొద్దీ సేపటి క్రితం వచ్చి చేరాయి. అంబాలాలోని ఎయిర్ బేస్ కు తొలి బ్యాచ్ లోని ఐదు జెట్ విమానాలు చేరుకున్నాయి.
ఇటీవల కరోనా బారినపడి కోలుకున్న కర్నూలు జిల్లా కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ ప్లాస్మా దానం చేసి ఆదర్శంగా నిలిచారు. గత నెలలో కరోనా బారిన పడ్డ ఎమ్మెల్యే ప్రభుత్వ వైద్యుల సూచనతో హోం ఐసొలేషన్లో ఉండి కోలుకున్నారు.
రాజస్థాన్ లో అశోక్ గెహ్లాట్ తన ప్రభుత్వం మెజారిటీని అసెంబ్లీలో నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని గవర్నర్ కల్రాజ్ మిశ్రా ను ఇప్పటికే మూడు సార్లు కలిసి విజ్ఞప్తి చేసినా అయన దానికి అనుమతి ఇవ్వలేదు.
ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పలు అంశాలకు సంబంధించి ప్రధాని మోదీపై విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చురకులతో కూడిన సలహాలిచ్చారు.
కరోనా వ్యాప్తి ప్రపంచంలోని అనేక దేశాలను చిన్నాభిన్నం చేసింది. కోట్లాది మందికి సోకి లక్షలాది మంది ప్రాణాలు బలి తీసుకోంటుంది. ఈ మహమ్మారి వ్యాపించని దేశం లేదు అంటే అతిశయోక్తి కాదేమో.
ఏపీ సచివాలయంలో మూడు గేట్లకు అడ్డంగా గోడలు నిర్మించడం చర్చకు దారితీసింది. సచివాలయం చుట్టూ ఆరు గేట్లున్నాయి. అందులో నాలుగు గేట్లు సచివాలయ నిర్మాణ సమయంలోనే ఏర్పాటు చేయగా...
రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ ను ఆ పదవి నుండి తప్పించి అయన ప్లేస్ లో ఎమ్మెల్సీ సోము వీర్రాజు ను కూర్చోబెట్టారు. ఐతే బీజేపీ అధిష్టానం ఈ సడెన్ నిర్ణయం వెనుక కన్నా లక్ష్మీనారాయణ తీసుకున్నకొన్ని నిర్ణయాలే కారణమని తెలుస్తోంది.