English | Telugu

59 రూపాయలకే హెటిరో కరోనా టాబ్లెట్

స్వల్ప నుంచి సాధారణ స్థాయి వరకు కరోనా లక్షణాలు గల రోగుల చికిత్స కోసం హెటిరో సంస్థ 'ఫెవిపిరమిర్' మందును బుధవారం లాంచ్ చేసింది. అయితే ఈ టాబ్లెట్ పేరును 'ఫెవివిర్' గా మార్చామని, ఒక్కో టాబ్లెట్ ధర 59 రూపాయలని ప్రకటించింది. ఈ జెనెరిక్ ఓరల్ యాంటీవైరల్ డ్రగ్ ను దేశంలోని సాధారణ కరోనా రోగులు వాడవచ్ఛునని స్పష్టం చేసింది. ఫెవిపిరమిర్ మెడిసిన్ ఉత్పత్తి, మార్కెటింగ్ కి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుండి అనుమతి లభించిందని స్పష్టం చేసింది.

కరోనా చికిత్సలో వినియోగించే 'కోవిఫర్' ని డెవలప్ చేసిన అనంతరం రెండో బ్రాండ్ గా 'ఫెవివిర్' ను ఉత్పత్తి చేశామని తెలిపింది. హెటెరో హెల్త్ కేర్ లిమిటెడ్ సంస్థ మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ చేస్తుందని ప్రకటించింది. దేశవ్యాప్తంగా అన్ని రీటెయిల్ మెడికల్ షాపులు, హాస్పిటల్ ఫార్మసీలలో ఈ మందు లభ్యమవుతుందని తెలిపింది. అయితే డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి అని పేర్కొంది.