English | Telugu

ప్లాస్మా దానం చేసిన వైసీపీ ఎమ్మెల్యే

ఇటీవల కరోనా బారినపడి కోలుకున్న కర్నూలు జిల్లా కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ సుధాకర్‌ ప్లాస్మా దానం చేసి ఆదర్శంగా నిలిచారు. గత నెలలో కరోనా బారిన పడ్డ ఎమ్మెల్యే ప్రభుత్వ వైద్యుల సూచనతో హోం ఐసొలేషన్‌లో ఉండి కోలుకున్నారు. ప్లాస్మాను ఇవ్వడానికి ఆయన ముందుకు రావడంతో.. కర్నూలు జీజీహెచ్‌ స్టేట్‌ కొవిడ్‌ ఆస్పత్రి బ్లడ్‌ బ్యాంకులో వైద్యులు ఆయన నుంచి 400 మిల్లీలీటర్ల ప్లాస్మా సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వచ్చిందని భయపడకూడదని, అలాగని అజాగ్రత్తగా కూడా ఉండకూడదన్నారు. తనకు గత నెల 20న కరోనా వచ్చిందని, ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు. కరోనా నుండి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేసి వల్ల మరో ముగ్గురు కరోనా బాధితుల ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు.