ఏపీలో కరోనా ప్రళయ తాండవం చేస్తోంది. ఎన్నడు లేని విధంగా ఈ రోజు ఏకంగా 10 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 70,584 శాంపిల్స్ ను పరీక్షించగా.. 10,093 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇదే సమయంలో 65 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,20,390 కి చేరగా, మరణాల సంఖ్య 1,213 కి చేరింది. ఇప్పటివరకు 55,406 మంది కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం 63,771 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 18,20,009 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.