English | Telugu
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీని బలోపేతం చేయడానికి తీసుకోవల్సిన చర్యలపై కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి కె బాలసుబ్రమణ్యంతో చర్చించారు.
ఏపీలో వరుసగా మూడో రోజు పది వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 61,699 శాంపిల్స్ ని పరీక్షించగా.. 10,376 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది.
భారత్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 16 లక్షలు దాటింది. ప్రతి రోజు రికార్డ్ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది.
కంటికి కనిపించని వైరస్ దాడితో అనేక రంగాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకు పోయాయి. అందులో విమానయాన రంగం ఒకటి. ఒకప్పుడు ధనికులకే అందుబాటులో ఉండేది ఆకాశయానం.
ఉత్తరప్రదేశ్ లోని ఘజీపూర్‌లో 42 మంది కరోనా రోగులు కనిపించకుండా పోవడం కలకలం రేపుతోంది. వారంతా కరోనా పరీక్షలు చేయించుకున్న సమయంలో తమ ఫోన్ నంబర్లు, చిరునామాలను తప్పుగా ఇచ్చినట్టు అధికారులు తెలిపారు.
కరోనా చికిత్స కోసం గుర్తించిన ఆసుపత్రుల్లో బెడ్ల ఖాళీలు, భర్తీల వివరాలు ఆస్పత్రి హెల్ప్ డెస్క్‌లో అందుబాటులో ఉంచాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు.
ఏపీలో మూడు రాజధానుల బిల్లును, సీఆర్డీఏ రద్దు బిల్లును గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. మూడు వారాల క్రితం ఈ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కోసం పంపింది.
ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను మళ్లీ నియమించడం ఆలస్యమైనా.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని ఎంపీ రాఘురామకృష్ణం రాజు అన్నారు.
ఆగస్టు 14న రాజస్థాన్ అసెంబ్లీ సమావేశం జరగనుంది. దీంతో రాజస్థాన్ రాజకీయ సంక్షోభానికి తెర పడనుంది. అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కానసాగుతుందా? లేక కూలిపోతుందా? అనే విషయం తేలనుంది.
అగ్ర రాజ్యాలను, అభివృద్ధి చెందిన దేశాలను కబళిస్తున్న కరోనా వైరస్ జపాన్ లో పెద్ద ప్రభామేమీ చూపలేదు. వయోధికులపై ఎక్కువగా ప్రభావం చూసే కోవిద్ 19 వైరస్ వ్యాప్తిని చూసి ప్రపంచదేశాలు తమ దేశంలోని వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాయి.
ప్రకాశం జిల్లా కురిచేడు మండల కేంద్రంలో మద్యానికి బానిసలైన సుమారు 20 మంది శానిటైజర్ తాగడంతో వారిలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరొకరు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఏపీలో రాజధాని రగడ మాములుగా లేదు. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లు గవర్నర్ కు పంపగా మరో పక్క మొన్నటి వరకు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మి నారాయణ ఆ బిల్లులను ఆమోదించవద్దని లేఖ రాసిన సంగతి తెలిసిందే.
జాతీయ నూతన విద్యా విధానంలో భాగంగా రాష్ట్రంలో ప్రాథమిక విద్య వరకు మాతృభాషలోనే విద్యా బోధన కొనసాగించాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు.. సీఎం వైఎస్ జగన్ ను కోరారు.
భారత్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో 55,079 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది.
28 జూలై 1914 మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైన రోజు. సరిగ్గా అదే రోజు మరో యుద్ధానికి సిద్ధం అంటూ రాఫెల్ ఫైటర్ జెట్స్ గగనతలంలో భారత్ దిశగా దూసుకువచ్చాయి.