English | Telugu

ఫస్ట్ టైం చిరంజీవి గారితో ప్రైవేట్ జెట్ లో ట్రావెల్ చేశా!

  నీతోనే డాన్స్ ఈ వీక్ ఎపిసోడ్ లో ఎలిమినేషన్స్ రౌండ్ కూడా ఉంది. ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న ఎనిమిది జంటల నుంచి ఒక జంట కూడా ఎలిమినేట్ ఐపోయింది. ఐతే రాధా ఇక్కడ శ్రీముఖికి ఒక ట్విస్ట్ ఇచ్చారు. "అందరూ తమ తమ ఫ్యాన్ మూమెంట్స్ ని చెప్పేసారు కానీ ఒక్కరు మాత్రం చెప్పలేదు, చెయ్యలేదు, చూపించలేదు" అని రాధ అనేసరికి "శ్రీముఖి" అని కోరస్ పాడారు సదా, తరుణ్ మాష్టర్. ఇక రాధ సీట్ లోంచి లేచి స్టేజి మీదకు శ్రీముఖి దగ్గరకు వచ్చారు. "నేను ఒక ఫోటో పంపించాను కదా..చూపిస్తారా అని రాధ అడిగేసరికి చిరంజీవితో కలిసి జాటర్ ఫ్లయిట్ లో కూర్చున్న శ్రీముఖి ఫోటోని ప్లే చేశారు. "అందరూ తమ తమ ఫ్యాన్ మూమెంట్స్ చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది కాని ఈ ఫోటో చూస్తే మాత్రం నాకు చాలా కోపం వస్తోంది.

సాగర్ డాన్స్ ని రజనీ డాన్స్ తో పోల్చిన తరుణ్ మాస్టర్!

నీతోనే డాన్స్ ఆదివారం ఎపిసోడ్ లో నాలుగు జంటలు డాన్స్ లు అదరగొట్టేశాయి. ఇందులో సాగర్ -దీప జోడి డాన్స్ కి జడ్జెస్ అంతా ముద్దులిచ్చేశారు. స్ప్లిట్ పర్సనాలిటీ కాన్సెప్ట్ తో వీళ్ళు  చేసిన డాన్స్ స్టేజి మీద మంచి కలర్ ఫుల్ గా ఫుల్ ఎనర్జిటిక్ గా కనిపించింది.  ఇక సదా ఐతే రియల్లీ లవ్ యు గైస్ అని చెప్పేసారు. అసలు ఏం తినొచ్చారు మీరు ఈరోజు. చాలా అద్భుతంగా డాన్స్ చేశారు అని అన్నారు.  ఇక జడ్జి రాధా ఐతే తాను ఎలా చెప్పారో అలాగే చేశారని కాంప్లిమెంట్ ఇచ్చేసారు. ఇద్దరి ఈక్వల్ గా డాన్స్ చేసారని చెప్పారు. సాగర్ గుడ్ డైరెక్టర్ మాత్రమే కాదు బ్యూటిఫుల్ స్టూడెంట్ అని కూడా చెప్పారు రాధ.

కావ్య అవసరాల కోసం డబ్బులు ఇవ్వాలనే రాజ్ ప్లాన్ నెరవేరుతుందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -144 లో.. అప్పుని కళ్యాణ్ పోలీస్ స్టేషన్ నుండి విడిపిస్తాడు. అందరు కలిసి కనకం ఇంటికి బయల్దేరుతారు. కళ్యాణ్ కి కనకం కాఫీ చేస్తుంది. ఇది తీసుకొని వెళ్లి కళ్యాణ్ కి ఇవ్వమని అప్పుకి కాఫీ ఇస్తుంది కనకం. నాకు ఇవన్నీ సెట్ కావు.. నాకేమైనా పెళ్లి చూపులు జరుగుతున్నాయా? వెళ్లి నువ్వే ఇవ్వమని అప్పు అంటుంది. అయిన వినకుండా కనకం కాఫీని అప్పుతో పంపిస్తుంది. అప్పు కాఫీ తీసుకొని వస్తుంటే కళ్యాణ్ షాక్ అవుతాడు. ఏంటి నువ్వు తీసుకోని వస్తున్నావా అని కళ్యాణ్ అంటాడు. ఆ తరువాత కళ్యాణ్, అప్పు ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటారు. 

మైకేల్ జాక్సన్, అల్లు అర్జున్ డాన్స్ వీడియోస్ చూసి డాన్స్ నేర్చుకున్నా

నీతోనే డాన్స్ శనివారం ఎపిసోడ్ లో కావ్య-నిఖిల్ జంట చేసిన పెర్ఫార్మెన్స్ కి అందరూ షాకైపోయారు. చాలా యూనిక్ గా కొత్తగా చేశారు ఈ జంట. ఇక సదా ఫిదా ఐపోయి త్వరలోనే నిఖిల్ ని బిగ్ స్క్రీన్ మీద చూడాలనుకుంటున్నట్టు చెప్పింది. తర్వాత మిగతా కంటెస్టెంట్ జంటలంతా మంచి స్కోర్స్ ఇచ్చారు. ఇక శ్రీముఖి వాళ్ల లైఫ్ లో ఉన్న ఫ్యాన్ మోమెంట్ ఏమిటి అని అడిగింది. "నా లైఫ్ లో ఇంకా  ఫ్యాన్ మోమెంట్ అనేది ఇంకా రాలేదు. ఎప్పటికైనా అల్లు అర్జున్ గారిని కలుస్తాను..నేను చిన్నప్పుడు డాన్స్ క్లాస్ కి వెళ్లనే లేదు. మైకేల్ జాక్సన్ గారు, అల్లు అర్జున్ గారి డాన్స్ వీడియోస్ చూసి డాన్స్ నేర్చుకున్నా. కానీ ఏదో ఒక రోజు నేను అల్లు అర్జున్ గారితో స్క్రీన్ షేర్ చేసుకుంటా..

పవన్ కళ్యాణ్ దేవుడికంటే ఎక్కువ నాకు...కనిపిస్తే కాళ్ళ మీద పడతాను

తనకు పవన్ కళ్యాణ్ అంటే దేవుడి కంటే ఎక్కువ అని చెప్పాడు యాదమ్మ రాజు. నీతోనే డాన్స్ శనివారం ఎపిసోడ్ లో యాదమ్మ రాజు-స్టెల్లా ఇద్దరూ కలిసి ఈగ మూవీలో సాంగ్ కి డాన్స్ పెర్ఫార్మ్ చేసారు. ఐతే ఆ సాంగ్ కి వీళ్ళ డాన్స్ కి పెద్దగా మ్యాచ్ కాలేదు. జడ్జెస్ కి కూడా పెద్దగా నచ్చలేదు. స్కూల్ లో జరిగే ఫంక్షన్ డ్రామాలా ఉందంటూ కామెంట్ చేశారు. ఇకపోతే మిగతా కంటెస్టెంట్ జోడీస్ మాత్రం చాలా తక్కువ మార్క్స్ ఇచ్చారు. యాదమ్మ రాజు చాలా ఫీలవుతూ సైలెంట్ గానే ఇచ్చిన మార్క్స్ ని యాక్సెప్ట్ చేసాడు. ఈ వారం వీళ్లకు, అంజలి జంటకు మధ్య జరిగిన మాటల యుద్ధంతో యాదమ్మ రాజు కొంచెం ఫీలైనట్టే కనిపించాడు.

మహేష్ బాబుతో చేయడం చాలా హ్యాపీ...ఈసారి టీవీలో స్ట్రైట్ గా కూర్చుని చూడండి

నీతోనే డాన్స్ షోలో యాదమ్మరాజు జంటకి పవన్-అంజలి జంటకు ఈ శనివారం ఎపిసోడ్ లో  చిన్న క్లాష్  అయ్యింది. అంజలి-పవన్ జోడి "శంకర్ దాదా ఎంబిబిఎస్" మూవీ నుంచి ఒక సాంగ్ కి డాన్స్ చేశారు. పెర్ఫార్మెన్స్ అయ్యాక యాదమ్మరాజు-స్టెల్లాని మార్క్స్ ఇమ్మని అడిగింది శ్రీముఖి. వాళ్ళు 8 మార్క్స్ ఇచ్చారు. పవన్ ఎనేర్జి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకేలా ఉంది .. కానీ అంజలి ఎనెర్జీ తగ్గింది అని చెప్పారు. అలాగే ఒక స్టెప్ కూడా అంజలి వేయలేదు అని చెప్పాడు. దానికి శ్రీముఖి "ఓహో మీరు పవన్ లో చిరంజీవిని చూసారు..అందుకే ఆయన పక్కన చేసిన హీరోయిన్ లో ఎనర్జీ తగ్గింది అని అంటున్నారా" అంది.. "అవును" అన్నాడు రాజు. "లేదు ఈ సారి ఎం  చేస్తారంటే టీవీలో స్ట్రైట్ గా కూర్చుని చూడండి..అప్పుడు తెలుస్తుంది నా ఎనర్జీ డ్రాప్ అయ్యిందా లేదా అని ఎందుకంటే ఇప్పుడు సైడ్ కి కూర్చున్నారు కదా " అంది అంజలి.

ఫాన్స్ ఉంటే చాలు ఏమైనా చేసేస్తారు..విలన్ అట్రాక్షన్ తో ఉన్న హీరోతో నటించాను

నీతోనే డాన్స్ షో ఈ శనివారం ఎపిసోడ్ లో నటరాజ్ మాస్టర్ - నీతూ జోడి బాలకృష్ణ మూవీస్ లోని సాంగ్స్ కి డాన్స్ వేసి అదరగొట్టేసాడు. ఇక అచ్చంగా బాలకృష్ణను దింపేశారు నటరాజ్ మాష్టర్. ఈ పెర్ఫామెన్స్ కి అందరూ ఫుల్ ఫిదా ఇపోయారు. ఇక రాధ కామెంట్ల  వర్షం కురిపించారు.."హీరోస్ లో ఇంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఉన్న వ్యక్తిని నేను అసలు చూడలేదు అన్నారు. బాలకృష్ణ గారితో నేను నాలుగైదు సినిమాలు చేసాను. ప్రతీసారి ఆయన తన బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేస్తారు. ఆయన స్పిరిట్ ని, ఆయన ఎనెర్జీని ఇమిటేట్ చేయాలి అంటే అంత ఈజీ కాదు. కానీ నటరాజ్ మాష్టర్ మీరది చేసి చూపించారు." అన్నారు. ఇక కంటెస్టెంట్ జోడీస్ అంత కలిసి 27 మార్కులు ఇచ్చారు నటరాజ్ మాష్టర్ జోడికి. "మీ లైఫ్ లో షేర్ చేసుకునే బెస్ట్ ఫ్యాన్ మూమెంట్" ఏమిటి అని శ్రీముఖి అడిగింది. "బాలకృష్ణ గారితో నేను వర్క్ చేసాను. ఒక 20 సెకండ్స్ మూవ్మెంట్ చూపించాను.

అర్జున్ కళ్యాణ్ చేసిన పోస్ట్ తన కోసమేనా!

అర్జున్ కళ్యాణ్.. బాస్ సీజన్-6 తో అందరికి పరిచయమయ్యాడు. శ్రీసత్య గురించి మాట్లాడితే అర్జున్ కళ్యాణ్ పేరు వినిపిస్తుంది. బిగ్ బాస్ లో శ్రీసత్య వెంటే అర్జున్ కళ్యాణ్ ఉంటూ.. తనతోనే ఎక్కువ టైం గడిపేవాడు. అర్జున్ కళ్యాణ్ బిగ్ బాస్ ఎంట్రీకి ముందు ఒక వెబ్ సీరీస్ లో యాక్ట్ చేసాడు.. అది కూడా ఎక్కువ పాపులారిటి రాకపోయేసరికి ఎవరికి ఎక్కువగా తెలియలేదు.  ఆ తర్వాత బిగ్ బాస్ ఎంట్రీతో బాగా ఫేమస్ అయ్యాడు. శ్రీసత్య కోసం తన గేమ్ ని కొన్ని సందర్బాలలో త్యాగం చేసాడు. ఒకానొక సందర్భంలో బిగ్ బాస్ కి రావడం కూడా.. శ్రీ సత్య వల్లే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు అర్జున్ కళ్యాణ్.

కనకం రీల్ ఫ్యామిలీని కలిసిన రియల్ ఫ్యామిలీ!

నీప అలియాస్ కనకం.. ఈ పేరంటే స్డార్ మా టీవీ ప్రేక్షకులకు సుపరిచితమే. బుల్లితెర ధారావాహికల్లో టీఆర్పీలో నెంబర్ వన్ ర్యాంకింగ్ తో దూసుకెళ్తున్న స్టార్ మా టీవీ సీరియల్ "బ్రహ్మముడి". ఈ సీరియల్ కి ఒక ప్రత్యేక క్రేజ్ ఉంది. ఎందుకంటే ఈ సీరియల్ కథ, కథనం బాగుంటుంది. ఇందులో రాజ్, కావ్య, కనకం, స్వప్న, దుగ్గిరాల ఫ్యామిలీ ఇలా అందరు బాగా నటిస్తున్నారు. ప్రతీ పాత్రకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇందులోని క్యారెక్టర్స్ అన్నీ కూడా సమాజంలో ప్రస్తుతం ‌ఉన్న స్థితిగతులను ప్రతిబింబించేలా ఉండటంతో ప్రేక్షకులు ఈ సీరియల్ కి బ్రహ్మరథం పడుతున్నారు.