English | Telugu

తృటిలో తప్పించుకున్న కావ్య.. అడ్డంగా దొరికిపోయిన స్వప్న! 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -152 లో.. ఇంట్లో కబోడ్ లో కనిపించిన కావ్య వేసిన డిజైన్స్ చూసిన రాజ్ షాక్ అవుతాడు. తన లాప్టాప్ లో ఉన్నవి, కావ్య వేసినవి సేమ్ ఉండడంతో.. శృతికి రాజ్ ఫోన్ చేస్తాడు. ఫ్రీ లాన్సర్ గా వర్క్ చేస్తున్న అమ్మాయి పేరేంటని రాజ్ అడగగానే.. శృతి టెన్షన్ పడుతూ కావ్య పేరు చెప్పకుండా శిరీష అని చెప్తుంది. ఆ తర్వాత రాజ్ కి శృతి అబద్ధం చెప్పిందని అర్ధం అవుతుంది. కావాలనే శృతి చేత కావ్య అబద్ధం చెప్పిస్తుందని రాజ్ అనుకొని ఎలాగైనా నిజమేంటో తెలుసుకోవాలనుకుంటాడు.

బ్రో వెర్సెస్ స్లమ్ డాగ్ హజ్బెండ్

"ఆలీతో ఆల్ ఇన్ వన్" షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కి "స్లమ్ డాగ్ హజ్బెండ్" మూవీ నుంచి బ్రహ్మాజీ, సంజయ్, ప్రణవి మానుకొండ వచ్చారు. బ్రాహ్మాజి రావడంతోనే ఆలీ కాళ్ళ మీద పడ్డారు.."ఎక్స్పెక్ట్ చేయలేదు..ఇంత వయసొచ్చినా కూడా" అని ఆలీ అనేసరికి "వయసేమిట్రా" అన్నారు బ్రహ్మాజీ. తర్వాత బ్రహ్మాజీ కొడుకు సంజయ్ వచ్చాడు. "నాన్న లాగ నువ్వు లేవు..మనం యూత్ ఇక్కడ" అని ఆలీ అనేసరికి "ఆయన యూత్ నెస్ చూసి నేను ఓల్డ్ ఐపోతున్న" అన్నాడు కామెడీగా. స్లమ్ డాగ్ హజ్బెండ్ మూవీ ఎప్పుడు రిలీజ్ అని ఆలీ అడిగారు. జులై 29 న అని బ్రహ్మాజీ చెప్పారు. దానికి ఆలీ 28 న ఎవరి సినిమా రిలీజో తెలుసా నీకు అని అడిగారు "బ్రో" అని చెప్తూ పవన్ కళ్యాణ్ మానరిజమ్ ని చేసి చూపించారు బ్రహ్మాజీ బ్రో వెర్సెస్ స్లమ్ డాగ్ హజ్బెండ్ అని రెండిటినీ కనెక్ట్ చేశారు.

తన పెళ్ళికి శేఖర్ మాష్టర్ ని, ప్రదీప్ ని రావద్దన్న ఆది..విగ్గు లాగేసి ప్రదీప్

ఈ వారం ఢీ ప్రీమియర్ లీగ్ లో సీనియర్ యాక్టర్ పృద్వి దీపికా పిల్లికి మావయ్య రోల్ లో వచ్చారు. హైపర్ ఆది రోబో మూవీలో "వసి" రోల్ లో వచ్చాడు. రోబోలను కనిపెట్టే సైంటిస్ట్ ని కానీ కొన్ని కనిపెట్టలేకపోతున్నా..మన శేఖర్ మాష్టర్ ఏ టైంకి ఎవరికీ ఫోన్ చేస్తున్నారో కనిపెట్టలేకపోతున్నా..పూర్ణ సాంగ్ కి సాంగ్ మధ్య గ్యాప్ లో కింద టేబుల్ మీద పెట్టుకుని ఎం తింటుందో తెలుసుకోలేకపోతున్నా, అక్షిత నాకు ఎందుకు కనెక్ట్ అయ్యిందో కనిపెట్టలేకపోతున్నా, భూమిక అడ్రస్ కనిపెట్టలేకపోతున్నాను" అని చాలా ఫ్రస్ట్రేషన్ ఫీలయ్యాడు ఆది. తర్వాత పృద్విని  ఇంప్రెస్ చేసి దీపికా పిల్లిని పెళ్లి చేసుకోవడానికి హైపర్ ఆది తెగ తంటాలు పడ్డాడు. ఇక పృద్వి ఆదికి ఎన్నో టెస్టులు కూడా పెట్టారు..కళ్ళకు గంతలు కట్టించి అబ్బాయిల చేత ముద్దు పెట్టించారు.

చీర కట్టుకెళ్తే ఆ లారీ డ్రైవర్ అల్లరి చేసాడు..అప్పుడు నేను మగవాడిలా వేషం మార్చుకున్నా

ఈ వారం ఢీ షో మంచి ఎమోషనల్ గా సాగింది. నెల్లూరి నెరజాణలు వెర్సెస్ ఓరుగల్లు వీరులు ఇద్దరూ ఈ వారం పోటీ పడ్డారు. కానీ నెల్లూరి నెరజాణలు మాత్రం మదర్ సెంటిమెంట్ తో ఎమోషనల్ టచ్ ఇచ్చే ఒక సాంగ్ చేశారు. వీళ్ళు తమిళనాడులోని పేచీయమ్మాళ్ అనే ఆమెను ఇన్స్పిరేషన్ గా తీసుకుని డాన్స్ పెర్ఫార్మ్ చేశారు. పెర్ఫార్మెన్స్ అయ్యాక  ఒరిజినల్ పేచీయమ్మాళ్ ని స్టేజి మీదకు తీసుకొచ్చారు. ఆమె లైఫ్ లో ఎదుర్కున్న ఎన్నో కష్టాలను తన మాటల్లో చెప్పారు. " నా పేరు పేచీయమ్మాళ్. నాకు 20 ఏళ్లకే పెళ్లి చేశారు. 15 రోజులకే నా భర్తే హార్ట్ ఎటాక్ తో చనిపోయారు. అప్పటికే నేను గర్భవతిని. ఆ విషయాన్ని ఇంట్లో చెప్పాను...ఆ టైములో తింటానికి తిండి లేక పెయింటింగ్ పనులకు వెళ్లేదాన్ని. కూతురిని ఎలా పెంచాలో తెలీక ఇబ్బందులు పడ్డాను. ఒక హోటల్ లో పనికి వెళ్లడం మొదలుపెట్టాక నా పేరును ముత్తుగా మార్చేసుకున్నాను. నా ఆధార్ కార్డు, రేషన్ కార్డులో కూడా పురుషుడు అనే ఉంటుంది.

సౌందర్యను పెళ్లి చేసుకోమన్నారు...అండర్ వరల్డ్ మాఫియాకు నేను బాగా తెలుసు

జెడి చక్రవర్తి అంటే చాలు ఒక సెన్సేషన్...యాక్టర్ గా, డైరెక్టర్ గా తెలుగు ఆడియన్స్ కి బాగా పరిచయం..మనీ, సత్య, బొంబాయి ప్రియుడు ఇలా ఎన్నో హిట్ మూవీస్ లో నటించారు కూడా. అలాంటి చక్రవర్తి రీసెంట్ గా ఈషా రెబ్బా, విష్ణు ప్రియాతో కలిసి "దయా" అనే మూవీలో నటించారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఎన్నో ఇంటర్వ్యూస్ కూడా ఇస్తున్నారు. అందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పారు. "ఉగ్రం మూవీని అమ్మ రాజశేఖర్ గారి దగ్గర తీసుకుని ఎంఎంఓఎఫ్ మూవీగా రిలీజ్ చేయడంలో కొంత అటు ఇటు అవడంతో డైరెక్షన్ అవకాశాలు తగ్గాయా  " అని అడిగిన ప్రశ్నకు "ఎంఎంఓఎఫ్ మూవీని నేను డైరెక్ట్ చేయలేదు..అమ్మ రాజశేఖర్ డైరెక్ట్ చేశారు.

పికె నేషనల్ లీడర్ అన్న సముద్రఖని..యూనివర్సల్ బ్రో ఇపోయానన్న సాయిధరమ్ తేజ్

త్వరలో "బ్రో" మూవీ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో సుమ డైరెక్టర్ సముద్రఖని, సాయి ధరమ్ తేజ్, కేతిక శర్మని ఇంటర్వ్యూ చేసింది.  "సముద్రఖని గారితో వర్క్ చేయడం అంటే చిన్నప్పుడు స్కూల్ గుర్తొచ్చింది..ఆర్టిస్ట్స్ పక్కనే కూర్చుని డైలాగ్స్ చెప్పిస్తారు...ఈ మూవీతో నేను యూనివర్సల్ బ్రో ఐపోయాను" అని చెప్పారు సాయి ధరమ్ తేజ్..తర్వాత వాళ్ళను కొన్ని ప్రశ్నలు అడిగింది సుమ "రీమేక్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు" అని  అడిగేసరికి "ఇది రీమేక్ కాదు..టోటల్ డిఫరెంట్ గా ఉంటుంది. రాజ్ కుమార్ హిరానీ గారి మూవీస్ లో ఫస్ట్ లో అంతా కామెడీగా లాస్ట్ లో ఎలా ఐతే ఎమోషనల్ గా ఉంటుందో సముద్రఖని గారి మూవీస్ కూడా అలాగే ఉంటాయి" అని చెప్పారు సాయి ధరమ్ తేజ్..."పవన్ కళ్యాణ్ గారితో చేయడం ఎలా అనిపించింది" అని తేజ్ ని అడిగింది సుమ. " ఒక పేజీ డైలాగ్ ఇచ్చి నన్ను ప్రిపేర్ అవమన్నారు.

చెయ్యి బానేఉంది కేక్ ఊగిపాయింది

పవన్ కళ్యాణ్ నటించిన "బ్రో" మూవీ త్వరలో రీలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ ప్రొమోషన్స్ లో భాగంగా ఈ మూవీలో నటించిన సాయిధరమ్ తేజ్, కేతిక శర్మ  నెక్స్ట్ వీక్ డ్రామా జూనియర్స్ సీజన్ 6 ఎపిసోడ్ కి గెస్టులుగా వచ్చేసారు. సాయిధరమ్ తేజ్ ని చూసేసరికి "అచ్చం చిరు అన్నను చూసినట్టే ఉంటుంది" అంటూ కాంప్లిమెంట్ ఇచ్చేసారు జడ్జ్ బాబుమోహన్. వెంటనే మరో జడ్జ్ శ్రీదేవి "హలో బ్రో" అనేసరికి "మీరు బ్రో అంటే కష్టంగా ఉందండి" అన్నాడు సాయి ధరమ్ తేజ్. "ఇప్పుడే అందరూ బ్రో అన్నప్పుడు థ్యాంక్యూ అన్నారు" అని ప్రదీప్ కౌంటర్ వేసేసరికి  "ఆడియన్స్ పర్లేదు కానీ శ్రీదేవి గారు బ్రో అంటే మాత్రం బాలేదు" అన్న లెక్కలో ఒక డైలాగ్ వేశారు.

ముడ్డి కడిగే వయసులో మెలోడీ సాంగ్స్ అవసరమా...రాత్రి ఎందుకు పిలిచారు అన్న రష్మీ

శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో భలే ఫన్నీగా ఉంది. ఇందులో రాంప్రసాద్ నులక మంచం మీద నిద్రపోవడం,  కలలో ఒక సౌందర్య రాశి రావడం ఆ మంచం పక్కన కాలి పట్టీ వదిలేసి వెళ్లడం దాన్ని రాంప్రసాద్ తీసుకుని ఆ అమ్మాయి గురించి తెలుసుకోలేని అనుకోవడం అంతా ఫన్నీగా అనిపిస్తుంది. ఆ అమ్మాయి గురించి తెలుసుకోవడానికి రాంప్రసాద్ తన ఫ్రెండ్స్ ని పిలుస్తాడు. అలా రష్మీ, ఇంద్రజ అంతా వస్తారు. "రాత్రికి ఎందుకు పిలిచారు" అని రష్మీ డౌట్ తో అడిగేసరికి "నైట్ టైం జరిపిస్తామని తెలీదా మీకు" అన్నాడు రాంప్రసాద్ గుసగుసగా. వెంటనే ఇంద్రజ గట్టిగా అరిచేసరికి "అదే ఊళ్ళో జాతర ఒకటి చేయాలి అందుకే పిలిపించాం" అన్నాడు రాంప్రసాద్. తర్వాత రాకెట్ రాఘవ మంచి రొమాంటిక్ సాంగ్ తో డాన్స్ ఇరగదీసేసరికి వాళ్ళ అబ్బాయి వచ్చి "ముసలోడికి  దసరా పండగ అంటే ఇదేనేమో..ముడ్డి కడిగే వయసులో మెలోడీ సాంగ్ లు కావాలా నీకు .చేయాలంటే గుమ్మాడి గుమ్మాడి అనే సాంగ్ చేయాలి కానీ గున్నా గున్నా మామిడి అంటావు రష్మీలా ఊగుతావు " అని చెప్పిన డైలాగ్ కి అంతా నవ్వేశారు.

నైట్ వెళ్ళేటప్పుడు ఈ రెడ్ డ్రెస్ వేసుకెళ్తే కష్టం..నా రోల్ పేరు దుర్యోధన అని చెప్పిన రఘు

"ఆదివారం విత్ స్టార్ మా పరివారం" షోకి  ఈ వారం "హిడింబా" మూవీ టీమ్ వచ్చేసింది. ఈ షోకి అశ్విన్ బాబు, రఘు కుంచె, డైరెక్టర్ అనిల్ కృష్ణ, సాహితి వచ్చారు.."హిడింబా అనగానే ఎందుకు మీరు అశ్విన్ గారినే సెలెక్ట్ చేసుకున్నారు" అని శ్రీముఖి అడిగింది. "కటౌట్ చూసారు కదా. చెప్పాలంటే ఈ మూవీ అందరికీ ఛాలెంజింగ్ . టెక్నిషన్స్ కి, ఆర్టిస్ట్స్ కి ఈ మూవీ ఒక ఛాలెంజింగ్ అని చెప్పొచ్చు. ఈ మాట ఎందుకు అన్నమాటే మూవీ చూసాకే అర్ధమవుతుంది" అని చెప్పారు అనిల్ కృష్ణ. ఇక మూవీలో నందిత శ్వేతా ఉన్నారు ఇక ఇప్పుడు ఈ స్టేజి మీదకు మరో రోల్ లో నటించిన సాహితి వచ్చారు.."మరి సాహితి మీకు ఈ మూవీలో చేయడం ఎలా అనిపించింది అని అడిగింది.

డబ్బులు తీసుకుంటున్నావుగా పంచులు పేలడం లేదు...హరి మీద అవినాష్ ఫైర్

"ఆదివారం విత్ స్టార్ మా పరివారం స్టార్ వార్స్" లో ఈ వీక్ సీనియర్ అండ్ జూనియర్ బుల్లితెర నటీనటులు వచ్చి సందడి చేసారు. అవినాష్, ఎక్స్ప్రెస్ హరి, పటాస్ ఫైమా ముగ్గురు పెద్ద సింగర్స్ లా బిల్డప్ ఇచ్చారు. కానీ ఆడియన్స్ ఎంటర్టైన్ కావడం లేదని పంచులు పేలడం లేదని హరి మీద ఫైర్ అయ్యాడు అవినాష్. "ఏం ఫైమాకి మంచి మంచి డైలాగ్స్ రాస్తున్నావ్...నాకేం రాస్తున్నావ్ నువ్వు..డబ్బులు తీసుకుంటున్నావ్ కదా..ఒక్క పంచ్ పేలడం లేదు.." అనేసరికి శ్రీముఖి కూడా "మీ వల్ల ఏం కావడం లేదు ఎలాగైనా నా చెల్లి ఫైమా చాలా టాలెంటెడ్ అనేసరికి "అవినాష్ కి వయసైపోయింది" అని మళ్ళీ డైలాగ్ వేసాడు హరి. ఇలాంటి డైలాగ్స్ మధ్యన టు టీమ్స్ ని పిలిచేసింది శ్రీముఖి. జూనియర్ యాక్టర్స్ ని ఇస్మార్ట్ పోరీల పేరుతో అలాగే సీనియర్ యాక్టర్ ని తీన్మార్ లేడీస్ పేరుతో ఇన్వైట్ చేశారు. "యాష్మి నాలా కర్లీ హెయిర్ ఎందుకు వేసుకొచ్చావ్ అనేసరికి నేను మీ పెద్ద ఫ్యాన్" అని చెప్పింది.

మందు, పెళ్లి, గన్ ఫైర్ కాన్సెప్ట్స్ తో ఎక్స్ట్రా జబర్దస్త్

ఎక్స్ట్రా జబర్దస్త్ మంచి ఎనెర్జీ ఇచ్చే స్కిట్స్ తో నెక్స్ట్ వీక్ ఆడియన్స్ ముందుకు వచ్చేస్తోంది. ఈ షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో ఫస్ట్ స్కిట్ గా  కమెడియన్ బాబు పెళ్ళికొడుకు గెటప్ లో వచ్చాడు.. "ఖుష్భు గారు నీకెవరురా పిల్లనిచ్చేది అన్నారు కదా..ఇప్పుడు నాకు పెళ్లి జరుగుతోంది..అది మీరే చూడాలి" అన్నాడు. తర్వాత ఇమ్మానుయేల్ వర్ష వచ్చి ఎంటర్టైన్ చేశారు. వీళ్ళ మధ్యలో ఇమ్మానుయేల్ వాళ్ళ అమ్మ వచ్చింది "పెళ్లంతా నాశనం చేస్తున్నావ్ కదరా, తాగుబోతోడా" అని ఇమ్ముని అనేసరికి "క్వార్టర్ వేస్తే నేను మనిషి కాదు అనేసరికి నేను క్వాటరున్నర వేస్తాను" అని రివర్స్ లో చెప్పింది వాళ్ళ అమ్మ .